అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `పుష్ష`. ఈ సినిమా మొదలై చాలా కాలమైంది. అయితే ఇప్పటి వరకూ విలన్ ఎవరన్నది ఫిక్స్ కాలేదు. విజయ్ సేతుపతి నుంచి – సునీల్ వరకూ విలన్ గాచాలామంది పేర్లు వినిపించాయి. బాబి సింహా, ఆర్య… ఇలా చాలా మంది ని పరిశీలించారు. ఇప్పుడు.. ఎట్టకేలకు చిత్రబృందం విలన్ ని వెదికి పట్టుకోగలిగింది. తనే.. ఫహద్ ఫాజిల్.
మలయాళంలో విలక్షణమైన నటుడిగా ఫాజిల్ కి మంచి గుర్తింపు ఉంది. తాను నటించిన కొన్ని చిత్రాలు.. ఆహాలో డబ్బింగ్ రూపంలో వచ్చాయి. అవి చూసి.. ఫాజిల్ కి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. తను జాతీయ అవార్డు విన్నర్ కూడా. ఇప్పుడు తననే.. ఈ సినిమాలో విలన్ గా ఫిక్స్ చేశారు. అల్లు అర్జున్‌కి మలయాళంలో భారీ ఎత్తున అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. మలయాళం నుంచి విలన్ ని తీసుకొస్తే… అక్కడ ఈ సినిమాకి మరింత బిజినెస్ పెరుగుతుంది. ఆ లెక్కలు కూడా ఫాజిల్ ని ఎంచుకోవడానికి ఓ కారణం కావొచ్చు.