ఈమధ్య టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న పేరు ఫహద్ ఫాజిల్. పుష్ష సినిమాలో తనే విలన్. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టులో ఫాజిల్ విలన్ అయిపోయాడు. రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రతినాయకుడిగా ఫాజిల్ పేరు దాదాపుగా ఖాయమైపోయింది. శంకర్ సినిమాల్లో హీరోతో పోటీగా ప్రతినాయకుల పాత్రలుంటాయి. ఈ సినిమాలోనూ బలమైన క్యారెక్టరైజేషన్ ఉండబోతోందని, రామ్ చరణ్‌తో నువ్వా? నేనా? అంటూ సాగే పాత్ర అదని తెలుస్తోంది. ఇదో పొలిటికల్ థ్రిల్లర్. ఫాజిల్ ఓ పొలిటికల్ లీడర్ గా కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చరణ్ – ఫాజల్ మధ్య జరిగే డ్రామానే ఈ కథకి కీలకం. ఇప్పటికే ఫాజిల్ తో చిత్రబృందం సంప్రదింపులు మొదలెట్టిందని, ఆయన కాల్షీట్లు అడ్జస్ట్ అయితే.. వెంటనే ఫాజిల్ పేరుని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అన్నట్టు.. ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాణీ ఎంపికైన సంగతి తెలిసిందే. కథ ప్రకారం మరో కథానాయికకీ అవకాశం ఉందని తెలుస్తోంది. ఆమె స్థానంలోనూ స్టార్ నాయికే కనిపించే ఛాన్సుంది.