కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసిన ఏఐ ఫోటోలు, వీడియోల విషయంలో ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా ఉన్నారు. వాటిని క్రియేట్ చేసిన వారే కాకుండా.. సర్క్యులేట్ చేసిన వారు ఎవరైనా సరే వదిలి పెట్టాలని అనుకోవడం లేదు. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారణి స్మితా సభర్వాల్ పైనా ఫిర్యాదు రావడంతో నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ టూరిజం సెక్రటరీ స్మిత సభర్వాల్ కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి AI ఇమేజ్ ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆమె కూడా తప్పుడు ప్రచారం చేసారని.. స్మిత సభర్వాల్ పై ఫిర్యాదు అందింది.
ఈ ఫిర్యాదుఆధారంగా 179 BNS ప్రకారం నోటీసులు ఇచ్చారు గచ్చిబౌలి పోలీసులు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై పూర్తి స్థాయిలో వివాదం రేగినప్పుడు.. చాలా మంది సెలబ్రిటీలు ఏఐ ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. కాస్త పరిశీలనగా, కామన్ సెన్స్ ను ఉపయోగించి చూస్తే అవి ఫేక్ ఫోటోలు, వీడియోలు అని స్పష్టమవుతాయి. అయితే చాలా మంది వైరల్ అవుతోంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా షేర్ చేశారు. తర్వాత ప్రభుత్వం కేసులు పెడుతూండటంతో.. చాలా మంది డిలీట్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్మిత్ సభర్వాల్ కూడా అలాంటి పోస్టును రీపోస్టు చేయడంతో చిక్కులు వచ్చాయి.
తర్వాత వాటిని డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయినా పోలీసులు మాత్రం నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్కు చెందిన పలువురికి పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు ప్రస్తుతం స్మితా సభర్వాల్.. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉన్నారు. తెలియక షేర్ చేశానని నిజం తెలిసిన తర్వాత డిలీట్ చేశానని ఆమె వివరణ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు.