ఇప్పుడు రాజకీయాల్లో ఫేక్ న్యూస్ ఓ టూల్. అయితే అంతిమ ఫలితాలు చూసిన తర్వాత కూడా ఈ ఫేకుల్ని వాటి ప్రభావాల్ని అంచనా వేసుకోలేకతక అదే బావిలో ఉండే రాజకీయాలు ఎక్కువైపోయారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రెండ్ నడుస్తోంది. ఏదైనా జరిగితే ఫేక్ తో హంగామా చేసేస్తున్నారు. గుడ్ల వల్లేరు కాలేజీ కావొచ్చు… వరదలు కావొచ్చు.. ఏదైనా సరే.. తప్పుడు సమాచారంతో విప్లవాన్ని సృష్టించుకుంటున్నారు.
ఒకడు అమరావతి మునిగిపోయిందంటాడు.. ఇంకొకడు ఎస్ఆర్ఎమ్ వర్శిటీ అంటాడు.. ఇంకొకడు మూడు వందల వీడియోలు అంటాడు. వీళ్లందరి కాన్సెప్ట్ ఒకటే. లేని దాన్ని ప్రజలు నమ్మేలా చేయడం. దాని వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతుందని వారి ఆశ. నిజానికి ఇలాంటి ఫేకులు చేసే వాళ్లు తాము అధికారంలో ఉన్నప్పుడు… తమపైనే ఎన్ని పాజిటివ్ ఫేకులు చేసుకున్నారో లేక్కే లేదు. ఇతరులపై ఎన్ని నెగెటివ్ ఫేకులు వేశారో అంతకంటే చెప్పాల్సిన పని లేదు. కానీ ఎన్నికల ఫలితం ఎలా వచ్చింది ? అంటే… ఏమిటి అర్థం.. నిజమేదో.. అబద్దమేదో ప్రజలకు బాగా తెలుసని !
ఇలాంటి ఫేకులు వేసుకుంటే… స్వయంతృప్తి మిగులుతుంది. ప్రభుత్వాలను రాజకీయ నేతలను వ్యతిరేకిచే వారికి… అవి నచ్చాయి. కానీ నిజంగా సమస్యల్లో ఉన్న వారిని మరిన్ని సమస్యల్లోకి నెట్టేస్తారు. లేని కెమెరాలు.. వీడియోల గురించి ప్రచారం చేయడం వల్ల ఆ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థినుల పట్ల ఇతరులు ఎలా చూస్తారు ?. ఇలాంటి ప్రమాదాన్ని వీరు తెలిసినా వీళ్లకు కావాల్సింది ఫేక్ న్యూస్. అదే కాలేజీలో వారి అమ్మాయి చదువుతూంటే అప్పుడు తెలుస్తుంది నొప్పి.
ఎన్ని ఫేకులు వేసుకున్నా… నిజాలు నిలకడగా అయినా ప్రజలకు తెలుస్తాయి. దానికి చరిత్రే సాక్ష్యం. ఇలాంటి ఫేకులు ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని కూడా చరిత్ర చెబుతోంది.