రాజకీయపార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు ఏం చేస్తారో తమ పార్టీకి అదే ఇమేజ్ వస్తుంది. ఆన్ లైన్ లో చేసే ప్రతి కామెంట్ పార్టీకి అంటుకుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాలసీలపై చేసే కామెంట్లు… పార్టీ విధానమే అనుకుంటారు సాధారణ ప్రజలు. అలాంటి సమయంలో సోషల్ మీడియా కార్యకర్తలు మరింత బాధ్యతాయుతంగా ఉండాలి. రాజకీయంగా విమర్శలు చేయడం.. బూతులు తిట్టుకోవడం వేుర… ప్రభుత్వ కార్యక్రమాలపై రాజకీయం తరహాలో మానసిక వికృతం చూపించడం వేరు.
గతంలో చేసిన చేసిన పనుల కారణంగా వైసీపీ సోషల్ మీడియాలో చాలా మంది బూతురాయుళ్లు తమ అకౌంట్లను డీయాక్టివేట్ చేసుకున్నారు. కానీ వారు వేరే ఖాతాలతో మళ్లీ ముందుకు వచ్చారేమో కానీ ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై మళ్లీ బూతుదాడి ప్రారంభించారు. ప్రభుత్వం ఏ పని చేసినా అందులో తప్పులు వెదుకుతున్నారు. అలా చేయడం తప్పు కాదు.. కానీ తప్పులు వెదకడం అంటే వారి దృష్టిలో బూతులందుకోవడం.. లబ్దిదారుల్ని తిట్టడం.
అన్న క్యాంటీన్లపై వైసీపీ సోషల్ మీడియా సైన్యం చేస్తున్న విమర్శలు ఇలాగే ఉన్నాయి. అక్కడ కడుపు నింపుకుంటున్న వారందర్నీ పెయిడ్ అర్టిస్టులు అనడం.. అక్కడ భోజనం బాగోలేదని ప్రచారం చేయడం దగ్గర నుంచి … ఆ పేదల్ని బూతులు తిట్టడం వరకూ చాలా చేస్తున్నారు. శుభ్రత ఉండటం లేదని.. అదనీ.. ఇదనీ..ఎలాగోలా పేదల భోజనంపై కుట్రకు ప్లాన్ చేసుకుంటున్నారు.
అన్న క్యాంటీన్లలో లోపాలుంటే ఖచ్చితంగా బయటపెట్టాలి. ఆ క్యాంటీన్లు పెట్టడం దండగనుకుంటే ఆ విషయం చెప్పుకోవాలి కానీ ఇలా అందరిపై బూతులందుకోవడం మాత్రం.. ఆ పార్టీ సైకోయిజానికి పరాకాష్ట అన్న విమర్శలు వస్తున్నాయి. దీన్ని మాత్రం వారు మార్చుకోలేకపోతున్నారు.