జగన్ నాకు బాగా తెలుసు. సీబీఐ జేడీ మిత్రుడు. కేసు కొట్టేయిస్తానంటూ… నేరుగా మాజీ ఎంపీ రాయపాటి వద్దకే వెళ్లాడు.. మణివర్ధన్ రెడ్డి అనే మోసగాడు. రాయపాటికి డౌట్ వచ్చి.. అసలు సీబీఐ ఆఫీసర్లను సంప్రదించడంతో అసలు .. కాదు.. నకిలీ సీబీఐ ఆఫీసర్ అని బయట పడింది. ఈ కేసులో అసలు ట్విస్ట్.. ఈ మణివర్ధన్ రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో.. సన్నిహితంగా దిగిన ఫోటోను.. చూపించి.. ఈ మోసాలకు పాల్పడే ప్రయత్నం చేయడం. ముఖ్యమంత్రి కాబట్టి.. ఎంతో మంది వస్తూంటారు. ఆయనతో ఫోటోలు దిగుతూంటారు. కొద్ది రోజుల కిందట రాయపాటిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ కేసులో.. రుణాలు ఎగ్గొట్టినట్లుగా బ్యాంకులు ఫిర్యాదు చేయడంతో.. ఈ కేసు నమోదయింది.
ఈ కేసులో కొట్టి వేయిస్తానని.. .మణివర్ధన్ రెడ్డి రాయపాటి వద్దకు వెళ్లారు. ఈ మణివర్దన్ రెడ్డికి.. జగన్కు సంబంధం ఉందని కాదు కానీ.. అసలు జగన్తో పరిచయం ఉంటే.. సీబీఐ కేసులు కొట్టేయించగలరని.. ఎలా నమ్మించే ప్రయత్నం చేశారనేదే.. ఇందులో కామెడీ. ఎందుకంటే.. స్వయంగా జగన్మోహన్ రెడ్డినే.. పదకొండు సీబీఐ కేసుల్లో ఉన్నారు. ఆయనే ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి నేతతో తనకు సాన్నిహిత్యం ఉందని చెప్పుకుని.. నేరుగా.. కేంద్ర స్థాయిలో పరిచయాలు ఉన్న రాయపాటి వద్దకే వెళ్లడం.. విచిత్రం. ఈ మణివర్ధన్ రెడ్డి తీరు చూస్తూంటే… పెద్దలతో దిగిన ఫోటోలతో.. పెద్దలనే మోసం చేయాలనే అతి తెలిపికిపోయారని పోలీసులే సెటైర్లు వేస్తున్నారు.
అయితే ఈ మణివర్ధన్ రెడ్డి.. ఇప్పుడు దొరికాడు కానీ.. దొరకకుండా.. ఇంకా చాలా మందిని .. జగన్ తో దిగిన ఫోటోలను చూపించి మోసం చేశారన్న అభిప్రాయం పోలీసు వర్గాల్లో ఉంది. ఎందుకంటే.. ఏకంగా రాయపాటికే టోకరా వేయబోయామంటే.. కింది స్థాయి.. వారిని ఇంకా దబాయించడానికి అవకాశం ఉందని నమ్ముతున్నారు. సీబీఐ పేరు చెప్పి ఎంత మందిని మోసం చేశాడో.. దర్యాప్తులోనే తేలాలి.