ఏ కేసు భయంతో అయితే పార్టీ మారిపోయారో అదే కేసు ఇప్పుడు మళ్లీ వల్లభనేని. వంశీ మెడకు చుట్టుకుంటోంది. 2014-19 మధ్య కాలంలో వల్లభనేని వంశీ బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాలను తయారు చేయించి పంచారు. అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా వెలుగులోకి రాలేదు. కానీ వైసీపై అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మంది ఫిర్యాదుతో కేసు నమోదు అయింది. వెంటనే ఆయన కొడాలి నానిని పట్టుకుని వైసీపీలో చేరిపోయారు. ఆయన భయాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడించారు వైసీపీ నేతలు. ఇప్పుడు ఆయన ఎటూ కాకుండా పోయారు.
పోనీ కేసు అయినా లేకుండా పోయిందా అంటే అదీ లేదు. ఆ కేసు మళ్లీ తిరిగి వచ్చింది. తమ పార్టీలో చేరిన వంశీపై నకిలీ పట్టాల కేసును పట్టించుకోలేదు వైసీపీ. కానీ ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లారు. అన్ని ఆధారాలు ఉన్నాయన్నది కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఇప్పుడు వంశీపై కేసు నమోదు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి అవకాశం వస్తే టీడీపీ అయినా ఊరుకుంటుందా ?
వంశీ ఎక్కడ ఉంటున్నారో ఎవరికీ తెలియదు. ఎప్పుడైనా కోర్టుల్లో వాయిదాలు ఉంటే అనుచరులకు నల్లకోట్లు వేయించి సెక్యూరిటీతో వస్తున్నారు. తర్వతా మాయమవుతున్నారు. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్నారని ప్రచారం చేయించుకున్నారు. ఇప్పుడు నారా లోకేష్ రెడ్ బుక్ థర్డ్ ఫేజ్లో కొడాలి నాని, వల్లభనేని వంశీ సంగతి తెలుస్తామన్న సంకేతాలు ఇచ్చిన సందర్భంలోనే.. కొత్తగా ఇళ్ల పట్టాల కేసు బయటకు రావడం వంశీకి బ్యాడ్ సిగ్నలే.