చైనాలో మరో కరోనా తరహా వైరస్ విస్తరించిందంటూ దేశంలో భయందోళనలు రేపే ప్రయత్నాలను అందరూ విజయవంతంగా చేస్తున్నారు. చైనాలో పరిస్థితి నిజంగా ఎలా ఉందో తెలసుకోకుండా సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల్ని బట్టి అక్కడేదే జరిగిపోతోందని కొత్త కరోనా వస్తోందని దానికి ఎంపీఏవీ అని పేరు పెట్టేసి మరీ జనాలను భయపెట్టడం ప్రారంభించారు. మన దేశంలోనూ హై అలర్ట్ అన్నట్లుగా ప్రకటనలు చేశారు . అయితే చైనా మాత్రం తమ దేశంలో ఇంత జరుగుతుందని తమకే తెలియదని సెటైర్లు వేసింది. ఎలాంటి వైరస్ లేదని అంటోంది.
చైనాలో ఏం జరుగుతుందో సాధారణంగా బయటకు రాదు. అక్కడ ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటివి ఉండవు. వారి సొంత సోషల్ మీడియా ఉంటుంది. వాటిపైనా ఆంక్షలు ఉంటున్నాయి. చైనా ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసే విషయాలు మాత్రమే తెలుస్తాయి. అందుకే బయటచేసేప్రచాలను చాలా వరకూ నమ్మడానికి అవకాశం కలిపిస్తూ ఉంటాయి. గతంలో కరోనా విషయంలో చైనా చాలా దాచి పెట్టిందన్న ప్రచారం ఉంది. చైనా అలా ఉండటం వల్లనే దేశమంతా కరోనా పాకిందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే ఈ సారి వైరస్ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది.
అయితే కేంద్రం మాత్రం అధికారికంగా చైనాలో ఎలాంటి పరిస్థితులుఉన్నా..దేశంలో మాత్రం ఎలాంటి అలర్ట్ లేదని కంగారు పడాల్సిన పని లేదని స్పష్టం చేసింది. కానీ మీడియా , సోషల్ మీడియా మాత్రం స్పందించిన అతి మాత్రం మామూలుగా లేదు. ప్రజలకు సమాచారం ఇవ్వడం కంటే.. వారిని భయాందోళనలకు గురి చేసి ఎంతో కొంత వ్యూస్ రాబట్టుకునే ప్రణాళికలే అమలు చేశాయి. ఈ క్రమంలో తప్పుడు సెన్సేషనలిజానికే పెద్దపీట వేశాయి.