పెట్రోల్, డీజిల్ పై కేంద్రం రెండు రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని పెంచినట్లుగా వచ్చిన వార్తల్లో అయోమయం నెలకొంది. వాస్తవంగా అయితే కేంద్రం పెట్రో ధరల్ని పెంచిది. కానీ ఆ పెంపుదల భారం నేరుగా ప్రజలపై పడదు. కంపెనీలపైనే పడుతుంది. ఆ పెంపు కంపెనీలే భరిస్తాయి.
గతంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు బదిలీ చేయకుండా కేంద్రం.. ఎక్సైజ్ పన్నులను పెంచడం ద్వారా తన ఖాతాలో వేసుకునేది. అంటే..క్రూడాయిల్ ధరలను డైనమిక్ గా సవరించాల్సిన కంపెనీలు.. అలా సవరించి రేట్లు తగ్గిస్తాయి..కానీ అవి పెరిగిన ఎక్సైజ్ పన్ను రూపంలో కేంద్రానికి వెళ్తాయి. అలా చాలా సార్లు కేంద్రం చేసింది. అదే టెక్నిక్ తో ఇప్పుడు మరోసారి ఎక్సైజ్ డ్యూటీ పెంచింది కానీ.. ఆ భారం ప్రజలపై పడదు. ఆదాయం మాత్రం కేంద్రానికి వెళ్తుంది.
తాజాగా పెంపుదల ప్రకటన కూడా అలాంటిదే. ప్రస్తుత పరిస్థితుల్లో చార్జీలను పెంచాల్సిన అవసరం కేంద్రానికి లేదు. అయితే మిగులును పెట్రో కంపెనీలకు కాకుండా కేంద్రం తీసుకునేందుకే ఈ సర్దుబాటు. చాలా కాలంగా పెట్రో ధరలు స్థిరంగా ఉంటున్నాయి. మరికొంత కాలం అలాగే స్థిరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.