తులసీబాబు అనే వ్యక్తిని పోలీసులు రఘురామకృష్ణరాజు కేసులో విచారణకు పిలిస్తే ఆయన తులసిదళం పేరుతో పసుపు చొక్కాలేసుకున్న ఓ యాభై మందిని తీసుకుని వచ్చి పోలీసులపైనే దౌర్జన్యం చేశారు. పసుపు చొక్కారు.. టీడీపీ స్టిక్కర్లు.. చంద్రబాబు, ఎన్టీఆర్,లోకేష్ బొమ్మలు కూడా వాడేశారు. పోలీసుల సంగతి తేలుస్తామని వార్నింగులు ఇచ్చారు. వీరి తీరు చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు.
ఇంతకీ ఎవడీ తులసీబాబు. టీడీపీ కోసం అంతగా పని చేశాడా అని ఆరా తీస్తే.. ఆయన బ్లడ్లో వైసీపీ ఉంటుందని ఎవరికైనా తెలుస్తుంది. ఆయన వైసీపీ హయాంలో సీఐడీకి లీగల్ అడ్వయిజర్ అట. అందుకే .. రఘురామను అరెస్టు చేస్తే నేరుగా పోయి తన భారీ కాయంతో రఘురామ గుండెల మీద కూర్చున్నాడట. ఇలాంటి వాళ్లు తర్వాత .. ప్రభుత్వం మారితే కష్టమని..టీడీపీ నేతలకు దగ్గరైపోయారు. గుడివాడ ఎమ్మెల్యేకు ఆయన చాలా దగ్గరైపోయారు. ఎంతగా అంటే.. తులసీబాబును అరెస్టు చేస్తే గుడివాడ ఎమ్మెల్యే గుంటూరు కోర్టు వద్దకు వచ్చి గంట సేపు మాట్లాడి వెళ్లారు.
తులసీబాబు ఓ కేసులో ఉండి..టీడీపీ పేరుతో పోలీసులపైనే. దౌర్జన్యం చేశారంటే..ఇక బయట ఎలా ఉంటారో చెప్పాల్సిన పని లేదు. ఆయన అనుచరులపైనా కేసులు పెట్టారు. అయితే ఇలాంటి వారు టీడీపీ అని చెప్పుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. పార్టీకి సంబందం లేదని వారు.. వైసీపీ హయాంలో తప్పుడు పనులు చేసిన వారు కూడా.. టీడీపీ నేతలతో ఉన్న సాన్నిహిత్యంతో మళ్లీ అధికారాపార్టీలో చేరి అదే పనులు చేస్తున్నారు. ఒక్క తులసీబాబు కాదు అలాంటివాళ్లు చాలా మంది ఉంటారు. వారికి ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఇస్తేనే క్యాడర్ కు కాస్త మనశ్మాంతి ఉంటుంది.