బద్వేల్ ఉప ఎన్నికలో 70 శాతానికిపైగా పోలింగ్ నమోదయింది. బద్వేలులో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు జనసేన కూడా బరిలో నిలువ లేదు. అయినప్పటికీ వైసీపీ మెజార్టీని టార్గెట్ చేసుకుని పని చేసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లక్ష మెజార్టీని లక్ష్యంగా చేసుకుని పని ేశారు. వైసీపీ నేతలు ఓటర్లను భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలించుకోగలిగారు. అయితే చాలా చోట్ల దొంగ ఓటర్లు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. సమీప ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున కొత్త వ్యక్తులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లుగా వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
కొత్త వ్యక్తులను ఇతర పార్టీల నేతలు గుర్తించి పట్టుకున్నారు. వారు పరుగులు తీసిన దృశ్యాలు వెలుగు చూశాయి. అయితే తిరుపతి ఉపఎన్నికల్లో చెప్పినట్లుగానే దొంగ ఓటర్లను తరలిస్తున్నారన్నది అబద్ధం అని ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. ప్రధాన పార్టీలు బరిలో లేకపోవడంతో చాలా మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అయితే వారిని పట్టుబట్టి అధికార పార్టీ ఓటింగ్ చేయించగలిగింది. అనూహ్యంగా బీజేపీకి దాదాపుగా అన్ని పోలింగ్ బూతుల్లోనూ ఏజెంట్లు ఉన్నారు.
టీడీపీ నేతలే బీజేపీకి ఏజెంట్లుగా కూర్చున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. కనీస క్యాడర్ లేని బీజేపీకి ఎన్నికను ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ దగ్గరుండి నడిపించారు. కనీసం ఓటు బ్యాంక్ పెరిగిందని చూపించాలని అుకుంటున్నారు. అయితే మెజార్టీతో తమ బలం నిరూపించాలనుకుంటున్న వైసీపీ… లక్ష్యాన్ని సాధించడం ఈజీగానే కనిపిస్తోంది.