దేవుడిపై కుట్రలు చేయాలి.. దేవుడి విశ్వాసాన్ని తగ్గించేయాలని కల్తీ కుట్రలు పన్ని.. కొండపై అరాచకాలు చేసినంత మాత్రాన భక్తులు నమ్మకం కోల్పోతారని అనుకోవడం… దేవుడిని అవమానించడమే. తాము నమ్మే దేవుడ్ని కూడా అవమానించడమే కాదు.. మోసం చేయడం కూడా. ఈ సూక్ష్మం తెలియని వారు.. హిందువులను దోచుకునేందుకు…దేవుడు పవర్ ఫుల్ కాదని చెప్పేందుకు ఈ రకమైన విన్యాసాలకు పాల్పడుతూంటారు. కానీ దేవుడిపై విశ్వాసం అనేది కల్తీ కుట్రలతో పోయేది కాదు. ఇలాంటి కుట్రలు బయటపడిన తర్వాత దేవదేవుడిపై మరింత నమ్మకం పెరుగుతుంది.
దేవుడిపై విశ్వాసాన్ని లడ్డూ వివాదం ద్వారా తగ్గించారంటూ… కొంత మంది మాట్లాడుతున్నారు. కానీ తప్పు చేసిన వాళ్లకి శిక్షలు పడతాయి కానీ.. దేవుడికి నష్టం జరగదు. హిందూత్వానికి .. హిందూ విశ్వాసాలకు.. ఇలాంటి దాడుల వల్ల ఎలాంటి ముప్పు రాదు. కానీ తమపై జరుగుతున్న దాడిగా భావించి .. దేవుడే అప్రమత్తం చేశారని అనుకుంటారు. ప్రపంచం ఊరకనే నడవదని… ఓ శక్తి నడిపిస్తుందని .. నూటికి 99 శాతం నమ్ముతారు. మన జీవితాల్లో జరిగే మిరాకిల్స్ కూడా ఆయన స్క్రిప్టే అని నమ్ముతారు. అందుకే దైవత్వానికి ప్రపంచవ్యాప్తంగా అంత నమ్మకం ఉంది.
తిరుమలలో అయినా… మరో మత పవిత్ర ప్రాంతంలో అయినా అపచారం జరిగిదే…అది ఆ దేవుడిపై విశ్వాసాన్ని ఏ మాత్రమైనా తగ్గిస్తుందని ప్రచారం చేస్తే.. అది దుర్భుద్ది మాత్రమే. ప్రస్తుత తిరుమల విషయంలో కొంత మంది అదే చేస్తున్నారు. తప్పు చేసినా బయట పెట్టడం వల్లే ఎక్కువ నష్టం శ్రీవారికి జరిగిందని… దేవుడ్ని కించ పర్చుకుంటున్నామని జగన్ రెడ్డి లాంటి వాళ్లు అతి తెలివి ప్రదర్శిస్తూంటే చాలా మంది పెయిడ్ మేధావులు… అదే సందుగా డబ్బు సంపాదన కోసం.. ముందుకొస్తున్నారు. ఇలాంటి కల్తీ కుట్రలను దేవుడిపై విశ్వాసాన్ని ఇసుమంత కూడా పెంచవు కదా… కొండంత నమ్మకాన్ని పెంచుతాయి.
తిరుమల తో పాటు అన్ని ఆలయాల్లో సంప్రోక్షణ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదంతా సంప్రదాయంగా అపచారం జరిగినప్పుడు చేయాల్సిన విధే. సందు దొరికింది కదా అని.. దేవుడిపై నమ్మకం తగ్గిపోయిందని ప్రచారం చేసినా జరగాల్సింది జరుగుతుంది. ఎందుకంటే దేవుడంటే..దేవుడే !