కౌశిక్ అనే తిరుపతి కుర్రాడు బ్లడ్ కాన్సర్ బారిన పడ్డాడు. ఎన్టీఆర్ అభిమాని అని ప్రచారం జరగడం, తనకు చావు దగ్గర పడిందని ఎన్టీఆర్ దేవర చూసి చచ్చిపోతానని వీడియోలు విడుదల చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కరిగిపోయారు. ఎన్టీఆర్ కు సమాచారం ఇచ్చారు. ఫ్యాన్ కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. కర్నాటకు చెందిన తన ఫ్యాన్స్ అసిసోయేషన్ సభ్యులను తిరుపతికి పంపారు. వారు వీడియో కాల్ లో ఎన్టీఆర్ తో మాట్లాడించారు.
గత సెప్టెంబర్ లో పది నిమిషాల పాటు ఎన్టీఆర్ ఆ కుర్రాడితో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఖచ్చితంగా ప్రాణం నిలుపుకుంటావని భరోసా ఇచ్చారు. బెంగళూరు వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆర్థిక సాయం కూడా చేశారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ప్రెస్ మీట్ పెట్టారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆర్థిక సాయం చేశారు కానీ.. ఎన్టీఆర్ చేయలేదని.. కనీసం రూ. ఇరవై లక్షలు వైద్యం కోసం కావాలని వారు అడుగుతున్నారు. ఎన్టీఆర్ ధైర్యం చెప్పి.. అభిమానుల్ని పంపి ఆర్థిక సాయం చేసినా.. మొత్తం వైద్య ఖర్చులు ఆయనే భరించాలన్నట్లుగా మాట్లాడుతున్న వారి తీరు చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
ఓ ఫ్యాన్ కు ఎన్టీఆర్ భరోసా ఇచ్చారు. ధైర్యం చెప్పారు. కొంత ఆర్థిక సాయం చేశారు. అలా కాకుండా మొత్తం ఆయనే పెట్టుకోవాలన్నట్లుగా మాట్లాడటం.. కాస్త విచిత్రమే. హీరోలు ఇంకెప్పుడూ మానవతా దృక్పథంతో కూడా ఎవర్నీ పరామర్శించకుండా ఇలాంటి ఆరోపణలు చేస్తూంటాయని ఫ్యాన్స్ మథన పడుతున్నారు. ఎన్టీఆర్ పై ఇలాంటి ప్రచారం ద్వారా ఒత్తిడి చేసి ఫోర్సుడ్ గా సాయం పొందాలన్న ప్రయత్నమేననని దానికి మీడియా సహకరిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.