లిక్కర్ అప్లికేషన్లను టీడీపీ నేతలు రింగ్‌గా మారి రాకుండా చేస్తున్నారని అప్లికేషన్లు ప్రారంభమైన రెండో రోజు నుంచే పద్దతిగా ఓ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇలా ప్రారంభించింది ఎవరో కాదు టీడీపీ సానుభూతిపరులే. వైసీపీ నేతలు కూడా ఇదేదో బాగుందని దోచుకుంటున్నారంటూ రచ్చ చేయడం ప్రారంభించారు. నిజానికి అప్లికేషన్ల గడువు ప్రారంభమైన వెంటనే అందరూ పోలోమంటూ వేసేయరు. గడువును బట్టి మంచి రోజును చూసుకుని వేస్తారు.
తాజాగా అప్లికేషన్ల గడువు ముగిసేనాటికి ప్రభుత్వానికి రూ. 1900 కోట్లకుపైగా దరఖాస్తు రుసుమే వచ్చినట్లుగా తేలింది. ఆన్ లైన్ లోనూ అర్థరాత్రి వరకూ అప్లికేషన్లు తీసుకున్నరు కాబట్టి రెండు వేల కోట్ల వరకూ వచ్చినా ఆశ్చర్యం లేదు . ప్రభుత్వం కూడా ఇంతే మొత్తం వస్తాయని అంచనాలు వేసింది. అంతే మొత్తం వచ్చింది. కానీ రింగ్ అయ్యారంటూ జరిగిన ప్రచారమే బోనస్. ఎమ్మెల్యేలు కానీ ఇంకెవరైనానీ మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకుంటామంటే అడ్డుకునే పరిస్థితి ఉండదు. కానీ వ్యాపారులు రింగ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఐదుగురు మాత్రమే వేద్దాం… ఎవరికి దుకాణం వచ్చినా ఐదుగురు పార్టనర్ షిప్ తీసుకుందామని ఒప్పందాలు చేసుకునేవారుంటారు. అలా రింగ్ అయ్యే వారిని ప్రభుత్వం నియంత్రించలేదు.
అయితే ఎమ్మెల్యేలపై జరిగిన దుష్ప్రచారం మాత్రం చాలా ఎక్కువ. ప్రతీ విషయంలోనూ ఇలా టీడీపీ నేతలు ఏదో చేసేస్తున్నారని ప్రచారం చేయడం కామన్ అయిపోయింది . ఇలా చేసేది టీడీపీ నేతలే. నిజానికి ప్రతి దానికి రెండో సైడ్ ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ నేతలు తమ పార్టీ వారికి మేలు చేయాలనకోవడం సహజం. అది చట్టపరంగా కరెక్ట్ అయినంత కాలం తప్పు లేదు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలకు ఈ అవకాశం కూడా ఇవ్వకుండా భయపెడుతున్నారు సొంత పార్టీ సానుభూతిపరులు.