‘బొమ్మరిల్లు’ భాస్కర్ ది ఎప్పుడూ ఫ్యామిలీ టచ్చే. లవ్ స్టోరీల్ని కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా తీస్తుంటాడు. బొమ్మరిల్లుతో ఫ్యామిలీ దర్శకుడిగా ముద్ర పడింది. పరుగు ఓకే అనిపించుకుంది. ఆరెంజ్ బాక్సాపీసు దగ్గర బోల్తా కొట్టినా – అందులో పాటలు సూపర్ హిట్టు. ఆ మాటకొస్తే బొమ్మరిల్లు భాస్కర్సినిమాలో పాటలన్నీ బాగుంటాయి. ఇప్పుడు అఖిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. అదే.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈ సినిమాలో పాటలపై కూడా భాస్కర్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోంది. గోపీ సుందర్ స్వర పరిచిన ఈ పాటని సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఈ పాటలో సినిమాపై క్రేజ్ పెరుగుతుందని చిత్రబృందం భావిస్తోంది.
అయితే ఈ సినిమాలో ఓ ఫ్యామిలీ సాంగ్ ఉందట. ఆ పాట మరింత బాగా వచ్చిందని, ట్యూన్, సెట్యువేషన్ ఇవన్నీ బాగా కుదిరాయని టాక్. శనివారం నుంచి హైదరాబాద్ శివార్లలో ఉన్న శంకరపల్లిలో ఈ పాటని తెరకెక్కించబోతున్నారు. ఈ పాటలో సినిమాలో ఉన్న ప్రధాన తారాగణం అంతా కనిపించనుంది. దాదాపు 30 ఆర్టిస్టులపై ఈ పాటని తెరకెక్కిస్తున్నారు. బొమ్మరిల్లులో.. ‘లాలూ దర్వాజ కాడ..’ అనే ఓ పెళ్లి పాట ఉంది. ఆ తరహాలోనే ఈ పాట కూడా సాగబోతోందని సమాచారం.