ఎన్టీఆర్కి 9వ నెంబర్ అంటే సెంటిమెంట్. ఎన్టీఆర్ వాడే కారు నెంబర్ ఏదైనా తీసుకోండి.. అన్నీ తొమ్మిదిలే కనిపిస్తాయి. 9999 అన్నది ఎన్టీఆర్ లక్కీ నెంబర్. ఇప్పుడు ఆ మోజుతోనే మరోసారి ఈఫ్యాన్సీ నెంబర్ని చేజిక్కించుకొన్నాడు ఎన్టీఆర్. ఇటీవల ఎన్టీఆర్ ఓ కొత్త కారు కొన్నాడు. ఆ కారు నెంబరు TS 09 EL 9999. ఈ నెంబరు కోసం ఏకంగా రూ.10.5 లక్షలు వెచ్చించాడు ఎన్టీఆర్. వేలం పాట ద్వారా ఈ నెంబరుని ఎన్టీఆర్కి కేటాయించారు ఆర్టీఏ అధికారులు.
ఈ తొమ్మిది అంకెపై ఉన్న మమకారం ఇప్పటిది కాదట. చిన్నప్పటి నుంచీ ఉందట. అందుకే 9 నెంబరుని ఇప్పటికీ వదల్లేకపోతున్నాడట ఎన్టీఆర్. అన్నట్టు ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ చివరి నాలుగు అంకెలూ…తొమ్మిదిలే. ఈ 9పై ఎంత పిచ్చి ఉంటే మాత్రం మరీ పదిలక్షలు పోయాలా? ఆడబ్బుతో ఏదైనా మంచి పని చేయొచ్చుగా అని నాన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుసగుసలాడుకొంటున్నారు. ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం.. మధ్యలో కాదనడానికి మనం ఎవరం??