ఏపీలో ఏ నోట విన్నా పిఠాపురంలో వార్ వన్ సైడ్… పవన్ విక్టరీ పక్కా అని తేల్చేస్తున్నారు. మెజార్టీ లెక్కేంత అనేది మాత్రమే క్లారిటీ రావాల్సి ఉందంటున్నారు. ఎట్టకేలకు తమ అభిమాన హీరో, నేత ఎట్టకేలకు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడని ఖుషి , ఖుషి అవుతున్నారు. పవన్ అనే నేను అంటూ… ఎమ్మెల్యేగా జనసేనాని ప్రమాణస్వీకారాన్ని చూసేందుకు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.
నిజానికి పవన్ జనసేన పార్టీని స్థాపించి చాలా ఏళ్లు అవుతోంది. కానీ, ఆ పార్టీ అద్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలు కావడంతో జన సైనికులు తీవ్ర నిరాశ చెందారు. పైగా పవన్ రాజకీయాలకు పనికిరాడని వైసీపీ నేతలు ఎవరికి వారుగా స్టేట్ మెంట్లు ఇచ్చేశారు. ఆయనను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత జీవితంపై కూడా దాడి చేశారు. అయినా పవన్ ఎక్కడ వెనకడుగు వేయలేదు . దీంతో ఈసారైనా పవన్ కళ్యాణ్ పక్కా అసెంబ్లీలోకి వెళ్ళాలనే పట్టుదలతో ఆ పార్టీ నేతలు, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సైతం పవన్ కు సపోర్ట్ నిలిచారు.
టీడీపీకి జనసేన మద్దతుగా నిలవడంతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తోన్న 21నియోజకవర్గాల్లో ఆ పార్టీ సగానికి పైగా విజయం సాధిస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. అదే సమయంలో పవన్ కు రికార్డ్ స్థాయి మెజార్టీ వస్తుంది అన్న అంచనాలు ఉండటంతో జన సైనికులు కొత్త జోష్ లో కనిపిస్తున్నారు. పైగా .. జనసేనకు ఈసారి ఎక్కువ సీట్లు వస్తే ప్రభుత్వంలోనూ పవన్ కీరోల్ పోషించనున్నారని తెలుస్తోంది. దీంతో పిఠాపురంలో పవన్ గెలుపు కోసం అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.