రామ్ చరణ్ ఖైదీ రిలీజ్ డేట్ ఎప్పుడైతే ప్రకటించేశాడో అప్పటి నుంచీ బాక్సాఫీసు దగ్గర సమీకరణాలు మారిపోతూ వస్తున్నాయి. చిరు 11న రావడం ఖాయమని ముందే క్రిష్‌కి తెలీదని.. 13న ఖైదీ రిలీజ్ అవుతుందని భావించారని, అందుకే 12న గౌతమి పుత్ర రిలీజ్ డేట్ ప్రకటించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలన్నీ పక్కన పెడితే.. బాలయ్య అభిమానులు, సన్నిహిత వర్గాలు క్రిష్‌పై విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చిన మాట వాస్తవం. ‘ఖైదీ తోపాటు మన సినిమా కూడా రావాల్సిందే… రిలీజ్ డేట్ మార్చాల్సిందే ‘అంటూ క్రిష్ పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఒక దశలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్‌లో కీలక సభ్యులుగా ఉన్న రాజీవ్ రెడ్డి, సాయిబాబులు కూడా ‘మనం 11నే రావడం మంచిది’ అంటూ క్రిష్‌కి సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే క్రిష్ మాత్రం తొణకలేదు.. బెణకలేదు. ‘మనం మాత్రం 12నే వద్దాం..’ అని క్రిష్ గట్టిగా చెప్పాడట. ఎట్టిపరిస్థితుల్లో నూ రిలీజ్ డేట్ మార్చడానికి క్రిష్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. నిజంగా…క్రిష్ ఈ ఒత్తిళ్లకు లొంగి రిలీజ్ డేట్ మారితే… వ్యవహారం మరోలా ఉండేది.
నిజంగానే ఈ రెండు సినిమాలమధ్య యుద్ధ పూరిత వాతావరణం ఉందన్నది రిలీజ్ డేట్ మార్పిడితో క్లారిఫై అయిపోయి ఉండేది. బాక్సాఫీసు రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా.. అభిమానులు మాత్రం ‘నువ్వా, నేనా’ అని కొట్టుకొంటారు. ఆ అవకాశం ఇవ్వడం క్రిష్‌కి ఇష్టం లేదు. అందుకే తాను తీసుకొన్న నిర్ణయంపై నిలబడిపోయాడు. అంతేకాదు.. ‘ఈసారి సంక్రాంతికి ఇద్దరు లెజెండ్స్ వస్తున్నారు.. వారిద్దరినీ గౌరవించండి’ అంటూ ట్వీట్ చేశాడు. అది క్రిష్‌కి చిత్రసీమపై.. చిరంజీవిపై ఉన్న గౌరవానికి సంకేతం. ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ‘ఖబడ్దార్’ అంటూ నోరు జారిన పాపానికి క్రిష్ వైపు కూడా తేడాగా చూస్తున్నాయి కొన్ని కళ్లు. వాళ్లకు ఈ ట్వీటే సమాధానం కావొచ్చు. రేపు మీడియా ముందుకు వచ్చిన తరవాత కూడా ‘ఖబడ్దార్’ పై క్లారిటీ ఇవ్వడానికి నిర్ణయించుకొన్నట్టు తెలుస్తోంది. ఓ మంచి సినిమా తీసి.. ఆ సినిమా రిలీజ్ కాకుండానే ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకొన్నాడు క్రిష్. తాజా ట్వీట్‌తో… కత్తి కట్టకుండానే బాక్సాఫీసునీ జయించేశాడు. క్రిష్.. తూ గ్రేట్ హో!