‘సరైనోడు’ సినిమా అల్లు అర్జున్ కు ఊహించని విజయం అదించింది. మామూలు సినిమానే అనుకున్న ”సరైనోడు” బన్నీ కెరీర్ లోనే రెవిన్యు పరంగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సరైనోడు ఓ చేదు జ్ఞాపకాన్ని కూడా మిగిల్చింది. సరైనోడు సక్సెస్ పార్టీలో”చెప్పను బ్రదర్” అని అల్లు అర్జున్ చేసిన కామెంట్ పెద్ద దుమారాన్ని లేపేసింది. ఈ వేడుకలో పవన్ గురించి అడిగితే.. బోయపాటి ‘హ్యాంగ్ ఓవర్’ ఏమో కానీ అచ్చు సరైనోడు ‘గణ’ క్యారెక్టర్ మాదిరిగా ఓ రేంజ్ ఫైపర్ లో ”చెప్పను బ్రదర్”.. ‘చెప్పను బ్రదర్” అని బన్నీ కామెంట్ చేయడం .. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఎక్కడో కాలిపోయింది. అప్పటినుండి పగ పట్టేశారు బన్నీపై పవన్ ఫ్యాన్స్. సోషల్ మీడియా వేదికగా.. ”రేయ్.. నువ్వెంత నీ బ్రతుకేంత ?” అంటూ వీడియోలు,ఫోటులతో దండయాత్ర చేశారు. మొన్న దువ్వాడ జగన్నాధం టీజర్ వచినప్పుడు.. ”తొక్కలా వుంది” అంటూ డిజ్ లైక్స్ విషయంలో కొత్త రికార్డ్ సృస్టించారు పవన్ ఫ్యాన్స్. టాలీవుడ్ చరిత్రలోనే ఒక సినిమా ట్రైలర్ అత్యధిక డిజ్ లైక్స్ రికార్డ్ డిజే కి వచ్చినట్లు చేసి కసి తీర్చుకున్నారు పవన్ ఫ్యాన్స్. ఇక ట్రైలర్ కింద నెగిటివ్ కామెంట్స్ గురించి చప్పక్కర్లేదు. మామూలుగా తిట్టలేదు. నిజంగా ఇంత అసహనం ఏ హీరో కూడా ఎదుర్కోలేదనే చెప్పాలి.
ఇప్పుడు విషయంలోకి వస్తే.. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం కాటమరాయుడు ట్రైలర్ బయటికివచ్చింది. ఈ ట్రైలర్ కు కూడా గణనీయమైన డిజ్ లైక్స్ వున్నాయి. ఇప్పటివరకూ 47వేలకు పైగా డిజ్ లైక్స్ చేశారు ఈ ట్రైలర్ ను. పవన్ కళ్యాణ్ ట్రైలర్ కు ఈ రేంజ్ లో డిజ్ లైక్స్ అంటే ఖచ్చితంగా ఇది ‘ఫ్యాన్స్ వార్’ అని చెప్పాలి. అయితే ఈ డిజ్ లైక్స్ కు తమకు ఎలాంటి సంబధం లేదని కొందరు బన్నీ ఫ్యాన్స్ వివరణ ఇస్తున్నారు. ఇదంతా యాంటీ మెగా ఫ్యాన్స్ పని అని మిగాత హీరోల ఫ్యాన్స్ వైపు వేలు చూపిస్తున్నారు కొందరు. అయితే మీరు మీరు గొడవ పడి మిగతా ఫ్యాన్స్ అనడం కరెక్ట్ కాదని ఇంకొన్ని పోస్టులు వెలుస్తున్నాయి. ప్రస్తుతం ఈ తంతు ఇలా సాగుతోంది.
అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ ప్రవర్తన కూడా కాస్త బిరుసుగా వుందని చెప్పాలి. ”నేను హీరోని కాదు. ఏదో అదృష్టం కొద్ది అలా అయిపోయా. నా ద్రుష్టిలో మా అన్నయ్యే హీరో”అని స్వయంగా పవన్ కళ్యాణ్, అన్నయ్య చిరంజీవి పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. అటు రామ్ చరణ్ తో సహా మిగితా మెగా హీరోలు కాటమరాయుడు ట్రైలర్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కళ్యాణ్ పై తమకున్న ఇష్టాన్ని చాటుకున్నారు. అయితే అల్లు అర్జున్ నుండి మాత్రం ఎలాంటి స్పందన లేదు. కనీసం సోషల్ మీడియాను వాడుకొని పవన్ ట్రైలర్ ను షేర్ చేసి ”వెయిటింగ్ ఫర్ మూవీ” అని ఓ మాట అంటే ఏం అరిగిపోద్ది. కాని ఎందుకు బన్నీ నుండి అలాంటి రెస్పాన్స్ ఏమీ రాలేదు ఇప్పటివరకూ. బన్నీ పట్టుదల ఏంటో మరి.