చిరంజీవి .. జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు ప్రకటించలేదు. అది ఫేక్ లెటర్. .. అంటూ చిరంజీవి అభిమానులు… ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. వారికి చేతనయినంతగా.. చిరంజీవి విడుదల లెటర్‌ను ఫేక్ అని… అది వైసీపీ సృష్టి అని ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జనసేనకు సన్నిహితంగా ఉండే కొంత మంది నేతలు.. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా చెబుతూ.. నమ్మవద్దని చెబుతూ.. ప్రకటనలు చేస్తున్నారు. దీన్నే మెగాస్టార్ అభిమానులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారంటే… వాళ్లంతా… చిరంజీవి రాసిన లేఖను పరువు తక్కువగా భావిస్తున్నారు. చిరంజీవేంటి.. ఇలా చేయడేమేంటని… ఫీల్ అవుతున్నారు.
చిరంజీవి లెటర్ ఫేక్ అని పరువు కాపాడే ప్రయత్నం చేస్తున్న ఫ్యాన్స్..!
జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయాన్ని అనూహ్యంగా సమర్థిస్తూ.. చిరంజీవి లేఖ పంపారు. పిల్లికి ఎలుక సాక్ష్యంలా.. అందరూ అంగీకరించాలని ప్రజలకు.. ఓ సలహా కూడా పడేశారు. ఓ వైపు.. రాజధానికి భూములిచ్చిన రైతుల ఆక్రందనలు.. మిన్నంటుతూంటే.. తుగ్లక్ నిర్ణయాలతో.. ప్రజల్ని హింసిస్తూంటే… చిరంజీవికి కనిపించలేదు. కానీ ఆ నిర్ణయమేదో చాలా గొప్పదన్నట్లుగా అభివృద్ధి జరిగిపోతుందన్నట్లుగా.. చెప్పేసుకుని చిరంజీవి లేఖ రాశారు. అసహనంతో ఉన్న ప్రజల్లో.. తాజాగా.. ఇది మరింత అసహనాన్ని పెంచింది. స్వయంగా ఆయన అభిమానుల్లోనూ చిరాకు తెప్పించింది. ఇప్పటికిప్పుడు.. రాజకీయాల్లో వేలు పెట్టడం ఎందుకన్న ప్రశ్న వినిపించింది. అయితే.. నేరుగా అభిమాన నటుడ్ని..హీరోని విమర్శించలేక… చిరంజీవి లేక రాయలేదని.. .అది ఫేక్ ప్రచారం చేసి… అభిమానులే ఆయన పరువు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అది ఫేక్ అయితే.. మరుక్షణం చిరంజీవే చెప్పాలి. కానీ అది ఫేక్ కాదు. మీడియా సంస్థలకు ఆయన పీఆర్వో ద్వారానే అంది.
ఏపీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. ఒక్క మాట మాట్లాడకపోతివి కదా..!?
గత ఐదున్నరేళ్లలో కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కుదురుగా లేదు. ఏదో ఓ గొడవతో… ఏదో ఓ ఉద్యమంలో అల్లాడిపోయింది. ఓ సారి కాపు ఉద్యమం అని తగలబెట్టేశారు. ఇంకో సారి హుదూద్ వచ్చి కొట్టుకుపోయింది. ఇంకో సారి ప్రత్యేకహోదా ఉద్యమాలతో అట్టుడికిపోయింది. ఎప్పుడూ.. చిరంజీవి.. అయ్యో పాపం.. నా రాష్ట్రం.. నా ప్రజలు అనుకోలేదు. ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క రూపాయి సాయం చేయలేదు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి… ముఖ్యమంత్రి అయిపోవాలనుకున్న ఆయన చివరికి.. తనను ఆదరించలేదు కాబట్టి.. ప్రజల్ని ఆదరించాల్సిన అవసరం లేదనుకున్నారేమో కానీ.. సైలెంటయ్యారు. ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్నారంటున్నారు కాబట్టి.. ఆయనను డిస్ట్రబ్ చేయడం ఎందుకని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం పాలకుడి భజన కార్యక్రమం చేపట్టి.. ప్రజా ఇబ్బందుల్ని పట్టించుకోకపోవడమే.. అందర్నీ విస్మయ పరుస్తోంది.
సొంత లాభం కాస్త చూసుకుని …నమ్మినోళ్లని ముంచేస్తారా..?
చిరంజీవి పార్టీ ప్రారంభించడానికి… పవన్ కల్యాణ్‌లో ఉన్న సామాజిక బాధ్యత.. కూడా ఓ కారణం. ఇప్పుడు.. చిరంజీవి రిటైర్డ్ హర్టయ్యారు. పవన్ కల్యాణ్.. పదవులు కావాలన్న లక్ష్యంతో కాకుండా.. రాజకీయాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు సమస్య తీవ్రత అర్థమయింది. ఆయనపై వైసీపీ నేతలు చేస్తున్న దాడి చూస్తూనే ఉన్నారు. పవన్ పై .. వైసీపీ నేతలు చేస్తున్న దాడి .. ప్రతిస్పందన.. మొన్ననే విజయసాయిరెడ్డి కాపు సమావేశంలో చూశారు. ఇలాంటి సందర్భంలో… జగన్ కు జై కొడుతూ చిరు లేఖ రాసి.. అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేశారు.