ఫామ్ ల్యాండ్.. ఈ పేరు ఇప్పుడు అందరికీ నోటెడ్. ఇళ్లు కట్టుకునే ప్లాట్ల గురించి తెలుసు కానీ.. పొలాలు తెలుసు..కానీ ఈ ఫామ్ ల్యాండ్ కొత్త పద్దతి. భూమిని గంటుల్లో కొనేస్తారు. అది వ్యవసాయానికి పనికి రాదు. ఇటు ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఉండదు. లే ఔట్ కూడా వేయలేరు. కానీ ఎంతో కొంత భూమి ఉందన్న సంతృప్తి కొనుగోలుదారుకుని ఉంటుంది. భవిష్యత్ లో అనుమతులు తెచ్చుకోవచ్చన్న ఆశ కూడా ఉంటుది.
కానీ పొలాన్ని పొలంగానే ఉంచి అందులో గుంటల వారీగా అమ్మకాలు చేపడుతున్నారు. బడా సంస్థలు కూడా ఆ ఫామ్ ల్యాండ్స్ బిజినెస్‌లోకి ఎంటరయ్యాయి. ధరణి వచ్చిన తర్వాత గుంట వారీగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఎంతో కొంత పొలం ఉంటుందన్న భరోసాతో పాటు ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు వస్తూంటాయి. గుంట భూమికి కూడా పాస్ బుక్ ఇస్తున్నారు. దీంతో ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
Also Read : హైదరాబాద్ రూపు రేఖల్ని మార్చనున్న మూసి ప్రాజెక్టు !
ఫామ్ ల్యాండ్ లే అవుట్లపై దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అప్పటి వరకు ఎలాంటి పాలసీ లేదు. గ్రేటర్ లో రియల్ ఏస్టేట్ మెరుగ్గా ఉండడంతో నగర శివారులో ఫామ్ ల్యాండ్ కు డిమాండ్ పెరుగుతోంది. ఫామ్ల్యాండ్పేరుతో లేఅవుట్లు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్దం. ఫామ్‌ల్యాండ్ లేఅవుట్లను ప్రభుత్వం నిషేధించింది. అంటే.. పంట పొలాల్లో రోడ్లు వంటివి వేసి.. ప్లాట్లుగా విభజించకూడదు. అది నిబంధనలకు విరుద్ధం. విభజించకుండానే ఫామ్ ల్యాండ్ ను అమ్మేసుకోవచ్చు.
అర ఎకరం.. ఎకరం అమ్మే వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి. తమ దగ్గరే ఫామ్ ల్యాండ్స్ లో తామే మొక్కలు నాటి సంరక్షిస్తామని.. వీకెండ్స్ లో ఎంజాయ్ చేసేందుకు వీకెండ్ హోమ్స్ నిర్మిస్తామని కూడా చెబుతున్నాయి. వీటిలో ఇన్వెస్ట్ మెంట్ ఎంత మేలు అనేది కొనుగోలుదారులు నిర్ణయించుకోవాల్సి ఉంది.