కృష్ణా జిల్లాలో చందర్లపాడు గ్రామంలో భాస్కర్రావు అనే రైతు తన పొలం దున్నుకొంటుండగా ఒక పంచలోహ విగ్రహం బయటపడింది. దాని విలువ రూ. 50 కోట్లు ఉండవచ్చని పురావస్తు శాఖ నిపుణులు అంచనా వేశారు. ఆ విగ్రహాన్ని భాస్కర రావు అమ్ముకొనే ప్రయత్నం చేయకుండా హైదరాబాద్ వెళ్లి అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబు నాయుడుని కలిసి ఆయనకి ఆ విగ్రహాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి ఆ రైతుని అభినందించారు. ఆ రైతు చాలా తెలివయిన నిర్ణయమే తీసుకొన్నాడని చెప్పవచ్చును. ఒకవేళ అతను ఆ విగ్రహాన్ని ఎవరికయినా అమ్ముకొనే ప్రయత్నం చేసి ఉండి ఉంటే అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యేవాడు. కానీ నిజాయితీగా వ్యవహరించినందుకు ముఖ్యమంత్రి నుండి అభినందనలు అందుకోగలిగాడు.