పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా పర్యటనలో.. ఓ వృద్ధుడు.. పవన్ కల్యాణ్‌కు.. దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఆదోని మార్కెట్ యార్డులో రైతులతో పవన్ కళ్యాణ్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఒక రైతు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడారు. ఈ ఘటన పవన్ కల్యాణ్‌నే కాదు.. పక్కనే ఉన్న నాదెండ్ల మనోహర్నూ షాక్‌కు గురి చేసింది. ఎదురుగా ఉంది.. జగన్మోహన్ రెడ్డి అన్న భావనలో ఉన్నట్లుగా ఆ రైతు… పవన్ కల్యాణ్‌ను మర్చిపోయాయి. రాజకీయాల్లో అనుభవం లేదు కాబట్టి పవన్ చేష్టలుడిగి నిల్చుండిపోయాడు. సదరు రైతును అడ్డుకుంటే జనం దృష్టిలో పలుచనవుతామేమోనన్న భావనతో పవన్ మిన్నకుండిపోయిఉండొచ్చు. తనతో ముఖాముఖి కోసం వచ్చిన రైతులంతా తన గురించి మాట్లాడతారని పవన్ అనుకోవడమే… రాజకీయ అమాయకత్వం. అందుకే చేదు అనుభవం అనివార్యమైంది.
పక్కనున్న నాదెండ్ల మనోహర్ సైతం పవన్ కు భిన్నంగా ఏమీ అనలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. అది బహింగ సమావేశాం కాబట్టి.. రైతును అడ్డుకుంటే… రాజకీయ ప్రత్యర్థికి లాభం కలుగుతుందని.. ఆలోచించినట్లు ఉన్నారు. ఇదే సంఘటన ..ఏ చంద్రబాబు సభలోనే లేదంటే జగన్ మోహన్ రెడ్డి మీటింగులోనో చోటుచేసుకుని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. తమ మీటింగ్‌లో ఇతర పార్టీల వాళ్లు ర్చచ చేయడానికి వచ్చారని చెప్పి… సదరు రైతను పోలీసులకు అప్పగించేవారు. కొన్నాళ్ల క్రితం… కన్నా లక్ష్మినారాయణ ప్రకాశం జిల్లాకు వెళ్లినప్పుడు.. ఓ వ్యక్తి.. ప్రత్యేకహోదా కార్డు పట్టుకున్నాడని చెప్పి.. బీజేపీ నేతలు చావగొట్టారు. అలాంటి పరిస్థితే ఎదురయి ఉండేది. తమ రాజకీయ ప్రత్యర్థులే ఉద్దేశ్యపూర్వకంగా ఇతగాడికి తర్ఫీదిచ్చి పంపంచి తమ సమావేశాన్ని భగ్నం చేసే కుట్ర చేశారని బీజేపీలా ఆరోపించి సర్దుకునేవారు. పవన్ కు రాజకీయాల్లో అందులోనూ ఇలాంటి వ్యవహారాల్లో అస్సలు అనుభవం లేకపోవడంతోనే ఇలా జరిగింది.
ఏ రాజకీయ పార్టీ అయినా… స్టేజ్ మీద మాట్లాడటానికి పిలిచారంటే.. దానికి తగ్గట్లుగా ముందస్తు కసరత్తు చేసి ఉంటారు. ఉత్తినే ఎవర్ని పడితే వారిని పిలవరు. ఆ విషయం పవన్ కల్యాణ్‌కు తెలిసినట్లు లేదు. పవన్ కల్యాణ్.. ఇంకా చాలా రాజకీయం నేర్చుకోవాల్సి ఉంది. లేకపోతే.. ఇలా ఇతర పార్టీలకు.. ఉపయోగపడాల్సి వస్తుంది.