వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక… అంతా చూసే కళ్లలోనే ఉంటుందన్న సామెతను నిజం చేస్తోంది. వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.,.. ఏపీలోని ప్రజలు… అష్టకష్టాలు పడ్డారు. పంటలు పండలేదు. ఉద్యోగులకు జీతాలు రాలేదు. ఎవరూ కడుపునిండా సరైన తిండితినలేదని.. ప్రచారం చేశారు. అదే.. వైఎస్ జగన్ సీఎం అయ్యే సరికి పది రోజుల్లోనే పరిస్థితి మారిపోతోంది. సాగుకు కొత్త కళ వచ్చేసిందని… సాక్షి పత్రిక.. బ్యానర్లు ప్రచురించేస్తోంది.
జగన్ ఇచ్చే కరెంట్‌తో సాగుకు కొత్త కళట..!!
తొమ్మిది గంటల కరెంట్ ఇప్పటి నుండే.. ఇస్తున్నట్లుగా… సాక్షి పత్రిక కొత్త ప్రచారం ప్రారంభించింది. నిజానికి చంద్రబాబు.. ఎన్నికలకు మూడు నెలల ముందుగానే… రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ను అదీ పగటిపూట ప్రారంభిచారు. అప్పటి నుంచి విద్యుత్ అధికారులు ప్రయోగాత్మకంగా… కొన్ని వేల ఫీడర్లలో విద్యుత్ ను తొమ్మిది గంటలకు అందిస్తున్నారు. ఇప్పుడు.. అదే ప్రయోగాత్మక పంపిణీని ఇప్పుడే.. వైఎస్ జగన్ ప్రారంభిస్తున్నట్లుగా.. సాక్షి పత్రిక చెప్పుకు రావడం ప్రారంభించింది. దాంతోనే సాగుకు కొత్త కళ వస్తోందని.. ఆనంద పడిపోతోంది. కానీ వాస్తవ పరిస్థితుల్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతోంది.
కరువుపై రైతన్నకు భరోసా ఇచ్చే చర్యలేవి..?
ఏపీ వ్యవసాసాయాధికారిత రాష్ట్రం. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా తెలుసు. ఆ విషయాన్ని నీతిఆయోగ్ భేటీలో కూడా ప్రస్తావించారు. అలాంటి రాష్ట్రంలో కరువు చాయలు కనబడినప్పుడు ఏం చేయాలి..?. రుతుపవనాల జాడ లేకపోవడంతో.. కరువును ఎదుర్కొనేందుకు యుద్ధ ప్రాతిపదికన ఎలాంటి ఏర్పాట్లు చేయాలి..? అదను తప్పితే రైతన్నకు జరిగే నష్టం.. అంచనా వేయడం అసాధ్యం. అలాంటి పరిస్థితి లేకుండా… ప్రభుత్వ పరంగా ఏం చేయాలి..? అన్న ఆలోచన ఏ ప్రభుత్వమైన చేస్తుంది. కానీ.. ఏపీ సర్కార్ ఇంత వరకూ.. వ్యవసాయం రంగంపై కనీస దృష్టి పెట్టలేదు. సీఎం చెప్పలేదు కాబట్టి.. ఇతరులు పట్టించుకోవడం లేదు. ఏపీలో సాగు పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు ఇదే.
జగన్ సీఎం కాబట్టి.. అంతా హ్యాపీగా ఉన్నట్లుగానే కనిపించాలా..?
సొంత పత్రికలు అయినా… ప్రజలు కష్టాల్లో ఉన్నా.. వారి కష్టాలను కప్పి పుచ్చి.. గొప్పగా ఉన్నారంటూ.. పత్రికల్లో రాసుకొచ్చినంత మాత్రాన… వారి కష్టాలు తీరిపోవు. వాటిని సిన్సియర్‌గా పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు.. చంద్రబాబు సీఎంగా లేరు కాబట్టి… అందరూ సంతోషంగా ఉన్నారని.. సాక్షికి కనిపిస్తూంటే అది దృష్టి లోపమే అవుతుంది. మీడియాగా తన బాధ్యతను తాను నిర్వర్తించడం మానేసినట్లు అవుతుంది. అంటే..అంతిమంగా ప్రజలు చేటు చేయడమే..!