భారత రాష్ట్ర సమితి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. వందల కోట్లు ఖర్చు పెట్టి మరీ ఊరూవాడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రైతులకు రైతు వేదికల వద్ద విందు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే చాలా చోట్ల… రైతుల నుంచి ప్రభుత్వానికి మంత్రులకు ఎదురైన ప్రశ్న రుణమాఫీ. రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి .. విందు భోజనాల్లో మధ్యలోనే వెళ్లిపోయారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రూ. రెండు లక్షల రుణమాఫీ హామీ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిగా రూ. లక్ష ఏక మొత్తంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోయారు. ఇటీవల రుణమాఫీ చేస్తామని.. చెప్పినప్పటికీ.. కొంత మంది ఖాతాల్లో రూ. పాతిక వేల వరకూ జమ చేశారు కానీ..అత్యధిక మందికి రుణమాఫీ అమలు కాలేదు. దీనిపై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఇతర పథకాల పేరుతో రుణమాఫీ హామీని మర్చిపోయేలా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ ఎన్నికలు అంటే.. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలే గుర్తుకు వస్తాయి. అందుకే రైతులకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా ఈ అమలు కాని హామీల ప్రస్తావన వస్తోంది. ఈ హామీ విషయంలో రైతుల్లో ఉండే అసంతృప్తిని కేసీఆర్ ఎలా అధిగమిస్తారో కానీ.. ఇప్పుటికే వివిద రూపాల్లో రైతాంగంలో పెరిగిపోయిన అసంతృప్తికి ఇది కూడా తోడైతే.. కేసీఆర్ గట్టి ఓటు బ్యాంకును కోల్పోతారన్న అభిప్రాయం వినిపిస్తోంది.