కనీస మద్దతు ధరపై చట్టాన్ని రూపొందించడం సహా పలు తమ డిమాండ్ల సాధనకోసం ఢిల్లీ చలో’ మార్చ్‌కు రైతులు పోలుపునిచ్చారు. ఆందోళనలకు వివిధ రాష్ట్రాలనుంచి దాదాపు 20 వేల మంది రైతులు ఢిల్లీవచ్చే అవకాశాలున్నాయి. 2500 ట్రాక్టర్లను దేశ రాజధాని ఢిల్లీ తీసుకు వచ్చేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారని గుర్తించారు ఇప్పటికే పంజాబ్‌లోని వివిధ ప్రాంతాలనుంచి రైతులుపెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాలు పంచుకోవడం కోసం బయలుదేరాయి. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.
కనీస మద్దతు ధరలకు చట్టబద్ధ గ్యారంటీ కల్పించడంతో పాటుగా ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, రైతులు, రైతు కూలీలకు పింఛన్లు ఇవ్వాలని, వ్యవసా య రుణాలు మాఫీ చేయాలని, రైతులపై పోలీసు కేసులను ఉపసంహరించడంతో పాటుగా లఖింపూర్ ఖేరీ హింసాకాండల బాధితులకు న్యాయం చేయాలని, 2020లో చనిపోయి న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని తదితర డి మాండ్లతో రైతులు ఢిల్లీ చలో మార్చ్ చేపడుతున్నారు.
పంజాబ్ హర్యానా సరిహద్దులను మూసివేస్తూ పలు చోట్ల భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పంజాబ్‌తో తమ రాష్ట్ర సరిహద్దును అంబాలా సమీపంలోని శంభు వద్ద హర్యానా పోలీసులు మూసి వేశారు. ర హదారిపై ఇసుక సంచులు, ముళ్ల కంచెలు, కాంక్రీట్ దిమ్మెలను అడ్డుగా ఉంచారు. రోడ్లపై పదునైన ఇనుప మేకులను అమర్చారు. అల్లర్ల నిరోధక బలగాల వాహనాలను సైతం మోహరించారు. రాఫ్ దళాలతో సహా మూడంచెల భద్రతా వలయాన్ని సిద్ధం చేశారు. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో 144 సె క్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. మరో వైపు రైతుల ‘ఢిల్లీ చలో మార్చ్’ దృష్టా ఢిల్లీ పోలీసులు నెల రోజుల నిషేధాజ్ఞలు విధించారు. సోమవారంనుంచి మా ర్చి 12 వరకు నగరంలో144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు.