ప్రజాభిప్రాయాన్ని గౌరవించి.. తెలంగాణ ప్రభుత్వం… “దిశ” హంతకులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా.. తెలంగాణ సర్కార్.. కార్యాచరణ ప్రారంభించింది. ఆ కేసును విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని.. హైకోర్టుకు తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. వెంటనే హైకోర్టు కూడా.. దీనికి ఆమోదం తెలిపింది. ఇక స్పెషల్ కోర్టు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ కావడం.. రోజువారీ విచారణ జరగడం… లాంచనమే. అత్యంత వేగంగా.. తీర్పు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందట.. వరంగల్ జిల్లాలో ఓ పసిగుడ్డును.. ఓ కిరాతకుడు.. అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ కేసులో కూడా.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారు. వల్ల 56 రోజుల్లోనే విచారణ పూర్తై తీర్పు వెలువడింది. ఈ సారి అంత కన్నా వేగంగానే.. దిశ కేసులో తీర్పు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
“దిశ” కేసు దేశంలో.. చట్టాలపైనే కొత్త చర్చకు కారణం అవుతోంది. నిందితులు.. ఎంత ఘోరమైన.. తీవ్రమైన నేరాలు చేసినా.. ఎలా తప్పించుకోగలుగుతున్నారనే చర్చ.. సామాన్య ప్రజల్లోనూ… జరుగుతోంది. ఈ విషయం పార్లమెంట్ చర్చల్లోనూ ప్రతిధ్వినించింది. శిక్షలు ఆలస్యమవడం.. వివిధ కారణాలతో.. అత్యంత క్రూరమైన నేరాలు చేసిన వారిని కూడా.. క్షమించేస్తూండటంతో కఠినమైన చట్టాలున్నప్పటికీ… వాటి వల్ల ఉపయోగం లేకుండా పోతోందన్న అభిప్రాయం అంతటా ఏర్పడుతోంది. ఈ క్రమంలో… ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వల్ల చట్టాలపై మరింత నమ్మకం కలిగించే ప్రయత్నాలను చేస్తున్నారు.
నిర్భయ ఘటన జరిగినప్పుడు.. ఆమె పేరుతో.. ఓ చట్టం తీసుకు వచ్చారు. అదే అత్యంత కఠినమైన చట్టంగా పేర్కొన్నారు. కానీ.. లొసుగుల వల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదు. ఇప్పుడు.. కూడా దిశ ఘటన తర్వాత అసలు చట్టాలనే… వేగంగా అమలు చేసే వ్యవస్థ రావాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దిశ హంతకులకు శిక్ష పడటం ఆలస్యం అయితే.. మరోసారి నిర్భయ తరహా ఉద్యమం ఊపందుకునే అవకాశం ఉంది.