సెకీని అడ్డు పెట్టుకుని జగన్ రెడ్డి ఆడిన లంచాల ఆటలో అదానీ కూడా భ్రష్టుపట్టిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.అమెరికాలో బయటపడిన ఈ కేసుకు సంబంధించి తాజాగా.. మరికొంత సమాచారం వెలుగులోకి వచ్చింది. లంచాలు ఇచ్చారన్నదానికి పూర్తి సమాచారం ,ఆదారాలు ఉన్నాయని ఎఫ్బీఐ తాజాగా ప్రకటించింది. సాగర్ అదానీ ఫోన్లో లంచాలు ఎవరెవరికి.. ఏ ఏ రూపంలో పంపించారో ఎలక్ట్రానిక్ ఆధారాలు ఉన్నీ ఉన్నట్లుగా చెప్పారు. ఈ వివరాలను గౌతమ్ అదానీకి కూడా షేర్ చేశారని ఎఫ్బీఐ స్పష్టం చేసింది.
అమెరికాలో లంచాలు ఇవ్వడం అన్నది కేసు కాదు. కానీ లంచాలు ఇవ్వడం అనేది మాత్రం పెద్ద ఆధారం. లంచాలు ఇచ్చి రేట్లు ఎక్కువ చేసి.. అమెరికా మార్కెట్ నుంచి పెట్టుబడులు అక్రమంగా సంపాదించారని.. . అమెరికా స్టాక్ మార్కెట్ ను మోసం చేశారన్నది ప్రధాన అభియోగం. లంచాలు ఇచ్చి ఎక్కువ ధరలకు ఒప్పందం చేసుకుని దాని ద్వారా అత్యధిక లాభాలు వస్తాయని అమెరికా స్టార్ మార్కెట్ లో రిజిస్టరైన కంపెనీ నుంచి పెట్టుబడులు పొందారు. అయితే లంచాలు ఇచ్చినట్లుగా నిరూపిస్తేనే కేసు ప్రూవ్ అవుతుంది. అందుకే సాగర్ అదానీ ఫోన్ ద్వారా మొత్తం ఆధారాలు సేకరించేశారు.
ఈ ఆధారాలు బయటపడితే ముందుగా మన దేశంలో అడ్డంగా బుక్కయ్యేది మాజీ సీఎం జగన్ రెడ్డి. ఆయనకే రూ. 1750కోట్లు ఇచ్చారని ఎఫ్బీఐ చెబుతోంది. ఇప్పుడు అన్ని ఆధారాలను కోర్టులో పెట్టబోతోంది. ఇవి బయటపడిన రోజున ఏపీలో రాజకీయంగా పెను సంచలనం ఏర్పడనుంది.