ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి .. ప్రభుత్వానికి చిన్న కష్టం వస్తే తట్టుకోలేకపోతున్నాడు. ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడతాని చెప్పి.. పదవి పొందిన ఆయన ఇప్పుడు ప్రభుత్వం కోసం ఉద్యోగులకు ఆర్థిక నష్టం కలిగించాడనికి కూడా వెనుకాడటం లేదు. ప్రభుత్వం రెండు నెలల పాటు ఆపేసిన జీతాలు వడ్డీతో సహా అవసరం లేదని… ప్రభుత్వం కష్టాల్లో ఉంటే.. ఎలా తీసుకుంటామని ఆయన చెబుతున్నారు. ఈ మేరకు అ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. దీనికి కారణం రెండు రోజుల కిందట.. హైకోర్టు.. జీతాలు నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి లేదని.. జీవోను కొట్టివేస్తూ.. నిలిపివేసిన జీతం.. పన్నెండు శాతం వడ్డీతో రెండు నెలల్లో కట్టాలని ఆదేశించింది. తమకు అనుకూలంగా తీర్పు వస్తే సంబరాలు చేసుకోవాల్సిన ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి… ప్రభుత్వానికి కష్టం వచ్చిందని… మథనపడిపోయారు.
తమకు వడ్డీ వద్దని.. ఇవ్వాల్సిన మొత్తాన్ని నాలుగైదు వాయిదాల్లో ఇచ్చినా చాలని హైకోర్టులో త్వరలో రివిజన్ పిటిషన్ వేస్తామని వెంకట్రామిరెడ్డి చెబుతున్నారు. నిజానికి ఆయన ఇంత ప్రయాస పడాల్సిన పని లేదు. ఎవరెవరికి వడ్డీ వద్దంటున్నారో.. ఎవరెవరు ప్రభుత్వం నిలిపివేసిన జీతం వద్దనుకుంటున్నారో.. నాలుగైదు వాయిదాల్లో ఇచ్చినా పర్వాలేదనుకుంటున్నారో.. వారందరూ ప్రభుత్వానికి లేఖలు రాస్తే సరిపోతుంది. కావాలనుకున్నవారు.. సైలెంట్‌గా ఉంటే… వారికి కోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం మొత్తం ఇస్తుంది. ప్రభుత్వ కష్టాలను తమ కష్టాలను ఫీలయ్యే… వెంకట్రామిరెడ్డి లాంటి ఉద్యోగులు… అసలు తమ జీతాన్ని త్యాగం చేసినా…వారికి కూడా ఆనందమే ఉంటుంది.
ఎనరైనా ఉద్యోగులు వ్యతిరేకంగా నోరెత్తితే సస్పెషన్లు.. షోకాజ్‌ల పేరుతో భయపెట్టి.. సైలెంట్ చేసేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. విశాఖకు వెళ్లిపోవడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని వెంకట్రామిరెడ్డి హైకోర్టులోనే పిటిషన్లు వేస్తున్నారు. ఓ వైపు.. వేల మంది ఉద్యోగులు.. తాము ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. మరో వైపు.. ప్రభుత్వం ఇవ్వాల్సిన జీతం ఇవ్వమని కోర్టు ఆదేశించినా.. ఆయనే అడ్డుపడుతున్నారు. ఇవన్నీ ఉద్యోగుల్లో అసహనానికి గురి చేస్తున్నాయి. ఉద్యోగుల ప్రయోజనాలన్నింటినీ ప్రభుత్వానికి తాకట్టు పెడుతున్నారని మండిపడుతున్నారు. సీసీఎస్ రద్దు సహా… పీఆర్సీ నుంచి అనేక ప్రయోజనాలు ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి గురించి ఒక్క మాట కూడా ఆయన ప్రభుత్వంతో మాట్లాడటం లేదు.