తన సినిమాల విషయంలో దిల్ రాజు చాలా పర్టిక్యులర్‌గా ఉంటాడు. మరీ ముఖ్యంగా రన్ టైమ్ విషయంలో. దర్శకుడు ఎవరైనా సరే, రన్ టైమ్ విషయంలో దిల్‌రాజుదే అంతిమ నిర్ణయం. అదొక్కటే కాదు, సినిమా పూర్తయ్యాక ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూడా దిల్‌రాజు మాటే చెల్లుబాటు అవుతుంది. ఫిదా విషయంలో శేఖర్ కమ్ములకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చా అని చెప్పుకొచ్చాడు దిల్‌రాజు. ఫిదా సెట్ కి రెండు సార్లు మాత్రమే సెట్‌కి వెళ్లా అని ఆడియో ఫంక్షన్లో చెప్పుకొచ్చాడు దిల్‌రాజు. ఆ మాటా నిజమే. కాకపోతే… ఎడిటింగ్ టేబుల్ దగ్గర మాత్రం దిల్‌రాజు తన ఆధిపత్యం చూపిస్తున్నాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ సినిమా రన్ టైమ్ విషయంలో దిల్‌రాజు సంతృప్తిగా లేడట. సినిమా మొత్తం చూసిన దిల్‌రాజు.. శేఖర్‌కి చాలా కరెక్షన్లు చెప్పాడట. 25 నిమిషాల పాటు ట్రిమ్ చేయాలని సూచించాడట.
శేఖర్ స్టైల్ విభిన్నంగా ఉంటుంది. సహజత్వం కోసం సన్నివేశాన్ని లాగ్ చేస్తుంటాడు. ఆ లాగ్ క్లాస్ ఆడియన్స్‌కి నచ్చుతుంది కూడా. అయితే.. దిల్‌రాజు మాత్రం సినిమాని ట్రిమ్ చేసే విషయంలో పట్టుపట్టాడని, చివరికి శేఖర్ కమ్ముల కూడా అంగీకరించక తప్పలేదని తెలుస్తోంది. ఫైనల్ అవుట్ పుట్ 2 గంటల 15 నిమిషాలకు కుదిరించే పనిలో ఉన్నారని సమాచారం. ఈసారి శేఖర్ సినిమా కాస్త క్రిస్పీగా.. ఫాస్ట్‌గా ఉండొచ్చన్నమాట.