ఫిదా నుంచి ఇప్పటి వరకూ ఓ టీజర్, ఓ ట్రైలర్ వచ్చాయి. చూస్తుంటే… ఏదో వెలితి. ఉప్మా పెసరెట్టులో అల్లం మిస్సయినట్టు, పులిహోరలో ఇంగువ మిస్సయినట్టు… సమ్ థింగ్ తేడా కొట్టింది. ఆ వెలితి దిల్ రాజు అండ్ టీమ్కీ.. కలిగినట్టుంది, ఇప్పుడు ఫిదాకి సంబంధించిన కొత్త ట్రైలర్‌ని వదిలారు. ఈ ట్రైలర్లో వరుణ్ తేజ్, సాయి పల్లవి తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు. వాళ్ల మాటలే వినిపించాయి. ఇద్దరి క్యారెక్టర్లు ఎంత స్ట్రాంగో, వాళ్ల బిహేవియర్ ఎలా ఉంటుందో, వాళ్ల కెమిస్ట్రీ, వాళ్ల మధ్య ప్రేమ, వాళ్ల ఎడబాటు, వాళ్ల విరహం, వాళ్ల గొడవలు, వాళ్ల అలకలు ఎలా ఉంటాయో చూపించాడు శేఖర్ కమ్ముల. ట్రైలర్ చూస్తే… హమ్మయ్య మన శేఖర్ మళ్లీ లైన్లోకి వచ్చేశాడనిపిస్తుంది. వరుణ్ తేజ్ తో పోలిస్తే… సాయి పల్లవి డామినేషన్ ఎక్కువ కనిపిస్తోంది. అయినా ఫర్వాలేదు. లవ్ స్టోరీస్ లో ఇవన్నీ చల్తా! ఇప్పటి వరకూ ఫిదాపై పెద్దగా ఆసక్తి కనబర్చని వాళ్లు కూడా… ఈ ట్రైలర్‌తో ఫిదా అయిపోయే ఛాన్సుంది. 23న ఫిదా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వెయిట్ అండ్ సీ… శేఖర్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో…!!