జూబ్లీహిల్స్ 040 పబ్బుల్లో రాత్రి రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఇది అమ్మాయి కోసం జరిగిన గ్యాంగ్ వార్. ఇందులో ఓ గ్యాంగ్‌కు లీడర్ డేవిడ్ సవాంగ్. మరో యువకుడు సిద్ధార్థ నేతృత్వం వహిస్తున్నాడు. మార్టన్ ఫైటర్స్ అని పేరు పెట్టుకున్నారు. వీరి మధ్య ఓ అమ్మాయి విషయంలో గొడవ జరుగుతోంది. రెండు వర్గాలూ పబ్‌లో ఎదురుపడ్డాయి. అందుకే గ్యాంగ్ వార్‌కు దిగారు. చివరికి డేవిడ్ సవాంగ్ వర్గానిదే పైచేయి అయింది. మార్టన్ ఫైటర్స్ బృందాన్ని ఇష్టం వచ్చినట్లుగా బాదేశారు.
అందులో యువకుడికి కన్నుపోయే పరిస్థితి ఏర్పడింది తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసులు అయ్యాయి. దీనిపై దెబ్బలు తిన్న వారు.. డేవిడ్ సవాంగ్ తండ్రిని కలిశారు. ఆయన ఇంకా వయోలెంట్ గా మాట్లాడారు. తేడా వస్తే శాల్తీలు ఉండవని హెచ్చరించి పంపేశారని చెబుతున్నారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టారు. కొన్ని వాట్సాప్ చాట్స్ ను రిలీజ్ చేశారు. ఈ వ్యవహారం పోలీసు, ాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
ఇంతకీ ఈ డేవిడ్ సవాంగ్ ఎవరు.. ఆయన తండ్రి అంత పవర్ ఫుల్లా అని ఎవరికైనా డౌట్ వస్తోంది. నిజమే చాలా పవర్ ఫుల్. సవాంగ్ అనే పేరు వినిపిస్తే ఏపీలో ఓ మాజీ డీజీ గుర్తుకు వస్తారు. ఎవరిపైనైనా రాళ్లేయడం ప్రజాస్వామ్య హక్కు అనే పోలీసు. ఆయనే కొడుకే ఈ డేవిడ్ సవాంగ్. సరిపోయారనుకుని జనం… ఆశ్చర్యపోతున్నారు. అధికారాన్ని ఇలా వాడుకుంటున్నారని.. మథనపడటం తప్ప సామాన్యులు ఎవరూ ఏమీ చేయలేరు.