మాకేమైనా గనులున్నాయా… మైనింగ్ ఉందా పార్టీ మారడానికంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఆ వెంటనే పార్టీ మారిపోయిన కరణం బలరాం అండ్ ఫ్యామిలీ వైసీపీలో కులం పేరుతో తిట్టించుకుని గౌరవం పొందుతోంది. పక్కనున్న పర్చూరు నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ … చీరాలకు వచ్చి మరీ… కరణం బలరాం కొడుకును.. కులం పేరుతో అందరి ముందు తిట్టి.. తృప్తి పడ్డారు. తిట్టించుకున్న కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు ఎలా ఉందో కానీ ఆయన అనుచరులకు మాత్రం… ఏందీ బతుకు అనుకోకుండా ఉండలేకపోతున్నారు.
చీరాల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరారు. అప్పటికే వైసీపీ నేతగా ఉన్న ఆమంచి దాన్ని ఎలా ఒప్పుకుంటారు ?. అందుకే రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. బలవంతంగా ఆయనను పర్చూరు పంపారు జగన్. కానీ ఆయన మనసు చీరాలలోనే. అందుకే వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికుల జరుగుతూంటే తమ వారిని నిలబెట్టాలని ఆయన వచ్చాడు. అక్కడే గొడవపడ్డారు. చివరికి పోలీసులు అడ్డుకుంటూంటే… కులం పేరుతో కరణం వెంకటేష్ ను దుర్భాషలాడారు.
ఓ కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించుకున్న పార్టీలో అదే కులానికి చెందిన వారు చేరితే ఇంత కన్నా గొప్ప ట్రీట్ మెంట్ ఉండదు. అంత కంటే ఎక్కువే జరుగుతాయి. కావాలనే చేస్తారు. రాజకీయం కోసం ఇంత దిగజారిపోవాలా అని అని వారు అనుకోనంత వరకూ జరుగతూనే ఉంటాయి. గౌరవాన్ని తగ్గించుకుంటే రాజకీయంగా ఎలా ఎదుగుతారో కానీ.. ఇప్పుడు ఎంతో బతుకు బతికిన కరణంను చూసి… ఆయన ఫ్యాన్స్ కూడా.. సిగ్గుపడిపోతున్నారు.