తిరుమల తిరుపతి దేవస్థానంపై నాలుగున్నరేళ్లుగా అన్యమతమస్తులు దాడులు చేస్తున్నారు. శ్రీవారి పవిత్రతను … తిరుమల కొండల ప్రాధాన్యాన్ని వీలైనంతగా తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అన్యమతస్తులు కొండపై తిష్టవేసి.. . పరిపాలన చేతుల్లో పెట్టుకుని … అపచారానికి పాల్పడుతున్నారు. తాజాగా భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా ప్రకటించడంతో ఇది పరాకాష్టకు చేరింది.
వైఎస్ ఫ్యామిలీ అంతా క్రిస్టియన్లు . అది బహిరంగ నిజం. వైఎస్ విజయమ్మ బైబిల్ చేతిలో లేనిదే బయటకు రాని కుటుంబం నుంచి వచ్చారు. ఆమె సోదరి హిందువు ఎలా అవుతారు ?. క్రిస్టియన్ అయిన వైవీ సుబ్బారెడ్డి ఆమెను పెళ్ళి చేసుకున్నారు. ఇదంతా బహిరంగరహస్యం. కానీ రాజకీయా ల కోసం వారు హిందువులుగా చెలామణి అవుతూంటారు. విజయమ్మ సోదరి… వైవీ సుబ్బారెడ్డి భార్య.. ఎప్పుడూ శ్రీవారి ఆలయంలోనే ఉంటారు. కానీ.. క్రైస్తవ కూటముల్లో బైబిల్ చూడకుండా మొత్తం వాక్యం ప్రకటించేస్తారు. ఆమె శ్రీవారికి వీరభక్తురాలు అనే ఓ ప్రచారాన్ని మాత్రం వదులుతారు.
ఇక టీటీడీ ఈవో ధర్మారెడ్డి వైఎస్ కుటుంబ బంధువు. ఇక టీటీడీలో ఉన్న అన్యమతస్తుల గురించి చెప్పాల్సిన పని లేదు. టీటీడీలో అన్యమతస్తుల్నితొలగించడానికి అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తే ఆయనను అత్యంత అవమానకరంగా పదవి నుంచి తప్పించారు. ఇప్పుడు మరోసారి భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమించారు. భూమన గురించి తెలిసిన ఎవరైనా ఇదేం ఖర్మ అనుకోకుండా ఉండలేరు.
మొదటిసారి టీటీడీ చైర్మన్ గా చేసిన పాపాల వల్లే అనేక అనర్థాలు జరిగాయని ఇప్పటికీ కొంత మంది నమ్ముతారు. ఇప్పుడు మరోసారి అదే పని చేస్తున్నారు. ఆయన క్రిస్టియన్ మాత్రమే కాదు… కమ్యూనిస్టు కూడా. హిందూ దేవుళ్లను అవమానించేలా ఎన్నో ప్రకటలు చేశారు. ఇంత దారుణంగా టీటీడీపై అన్యమతస్తులు దాడి చేస్తున్నా… ఏ ఒక్క హిందూ సంఘం కూడా పోరాడటం లేదు. వారికి రాజకీయాలే ముఖ్యం కానీ.. హిందూ ధర్మం కాదు. చివరికి బీజేపీకి కూడా !