ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా `సలార్`. కేజీఎఫ్‌తో చిత్ర సీమ దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు. కేజీఎఫ్‌లో యాక్షన్ సన్నివేశాలు కొత్త రీతిలో సాగాయి. ప్రతీ యాక్షన్ సీన్ కోసం దర్శకుడు చేసిన గ్రౌండ్ వర్క్ కళ్లకు కనిపించింది. హీరో ఎలివేషన్లు, చెప్పిన డైలాగులు ప్లస్ అయ్యాయి. సేమ్ టూ సేమ్ సలార్ నీ అదే ఫార్ములాలో నడిపించాలని నీల్ భావిస్తున్నాడట. అందుకే సలార్ సినిమాలో ఫైట్లతో జాతర చేయనున్నాడట. ఈ సినిమాలో ఏకంగా 6 యాక్షన్ ఘట్టాలకు చోటు వుందని తెలుస్తోంది. ఆరూ.. క్లైమాక్స్ ఫైట్లని తలదన్నే రీతిలో సాగుతాయని తెలుస్తోంది. యాక్షన్ సీన్లన్నీ `కేజీఎఫ్` టీమ్ తోనే డిజైన్ చేయించాడట. ఈ సినిమానీ యాక్షన్ సీన్‌తోనే మొదలెట్టాలని భావిస్తున్నాడు. లొకేషన్ రిక్కీలో భాగంగా చిత్రబృందం గోదావరి ఖనిని సంప్రదించిందని, అక్కడ ఓ ఫైట్ తెరకెక్కించబోతున్నారని సమాచారం.