జగన్ మాటల్ని నమ్మి జైలుకుపోతున్న వారిలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లే కాదు జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఇలాంటి వారిలో సీపీఆర్వోగా పని చేసిన పూడి శ్రీహరి అనే జర్నలిస్టు ముందు వరుసలో ఉన్నారు. ఈయన చేసిన వ్యవహారాలపై ఇప్పటికే పూర్తి స్థాయిలో ఓ ఫైల్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. అసలు ఏమీ లేకపోయినా తప్పుడు ప్రచారాలు చేయడంలో ఆయనది కీలక పాత్ర . నిజానికి శ్రీహరిది కూడా ఏమీ లేదు. ఆయన ఫార్వార్డ్ చేస్తారు. మిగతా అంతా సాక్షి టీం ప్రిపేర్ చేసేది. కానీ నింద మాత్రం శ్రీహరి మీద పడింది. అదే ఆయనకు చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏబీ వెంకటేశ్వరరావుపై దేశద్రోహం ఆరోపణలతో నోట్ సీఎంవో గ్రూపులో పోస్టు చేయడం దగ్గర్నుంచి ఆయన చేసిన నిర్వాకాలు చాలా ఉన్నాయి. వ్యతిరేకంగా రాస్తున్న మీడియాలను బెదిరించడం, తగ్గిన వారికి డబ్బులు ఆఫర్ చేయడం వంటివి ఆయన చేతుల మీదుగానే నడిచాయి. అలాగే కొంత మంది అధికారుల బదిలీలు.. ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకుని పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. వీటన్నింటిపై పక్కా సమాచారంతో ఫైల్ రెడీ అయిందని అంటున్నారు
అంతే కాదు ఆయన వ్యక్తిగత జీవితం కూడా వివాదాస్పదమే. భార్య, కుమార్తె ఉండగానే ఓ సహచర జర్నలిస్టులో సహజీవనం చేశారు. అది కాస్తా పెద్దది కావడంతో కుటుంబంలో వివాదాలు వచ్చాయి. ఆ విషయాలపైనా ఇప్పుడు కొత్త కొత్త ఆరోపణలు ఆయనపై వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధికారంలో ఉన్నారని కన్నూమిన్నూ కానరాకుండా చేసిన దందాలకు… రుబాబుకు సరైన ట్రీట్మెంట్.. ఒకటి, రెండు నెలల్లోనే ఆయనకు ఇవ్వనున్నారు.