వివేకా హత్య కేసులో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. కొత్తగా వైఎస్ వివేకానందరెడ్డి రాసినట్లుగా చెబుతున్నలేఖకు నిన్ హైడ్రేన్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అనుమతి కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగితం లేదా కార్డ్ బోర్డ్ వంటి వాటిపై ఉపరితలాలపై గుప్త వేలిముద్రలను గుర్తించడానికి నిన్ హైడ్రేట్ టెస్టును నిర్వహిస్తారు. అయితే అందరికీ వస్తున్న డౌట్ ఇప్పటి వరకూ ఆ విషయాలు తెలుసుకోలేదా అని .
బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నుంచి నేరం జరిగినప్పుడు వచ్చే క్లూస్ టీం ముందుగా వేలి ముద్రల ఆధారాలు సేకరిస్తుంది. సంఘటనా స్థలంలో వస్తువుల మీద వేలి ముద్రలు..అలాగే వెంట్రుకలు లాంటివి ఉంటే సేకరిస్తుంది. మరి ఇప్పుడు హెచ్ డీ కాలానికి వచ్చినా.. రియల్ గా కూడా దర్యాప్తు అధికారులు వేలి ముద్రలు అదీ కూడా కేసులో కీలకమైన కేసులో లభించిన లేఖపై ఉన్న వేలి ముద్రలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరం.
ఆ లేఖ పోలీసుల చేతికి వచ్చే సరికి ఎన్నో చేతులు మారింది. ఇప్పుడు టెస్టుల్లో ఎవరి వేలి ముద్రలు గుర్తిస్తారో చెప్పడం కష్టం. అయితే వేలి ముద్రలు కన్నా ముందే ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలో ఫోరెన్సిక్ సైకలాజికల్ విశ్లేషణ చేయిచింది. ఆయన అభీష్టానికి విరుద్ధంగా రాయించారని.. తప్పనిసరి పరిస్థితులు, ఇతరుల ఒత్తిడి మధ్య ఆయన ఈ లేఖ రాసినట్లు ఉందని వెల్లడించింది. అందుకే ఆయన చేతిరాత అస్పష్టంగా, గజిబిజిగా కనిపిస్తోందని విశ్లేషణ తెలిపింది. కోర్టుకు కూడా సమర్పించింది. ఇప్పుడు వేలి ముద్రల లెక్క తీస్తున్నారు.
మరో వైపు ఈ కేసులో దర్యాప్తు ఎక్కడిదక్కడ ఆగిపోయినట్లుగా కనిపిస్తోంది. అవినాష్ రెడ్డి బిందాస్ గా ఉన్నారు.