మహేష్‌బాబు – మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా సెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సెట్ మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. హైదరాబాద్‌లోని రోడ్ నెంబర్ 87లో ఈ సినిమా కోసం ఓ సెట్ వేశారు. ఇది వరకు జ్యో అత్యుతానంద సినిమా కోసం వేసిన సెట్ ఇది. దాన్ని అటూ ఇటూగా చేసి.. మహేష్ సినిమా కోసం వాడుకొన్నారు. దీపావళి టపాసుల వల్లే… సెట్లో మంటలు చెలరేగాయని, అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోగా సెట్ మొత్తం కాలిపోయిందని తెలుస్తోంది. ఇదే విషయమై చిత్రబృందాన్ని ఆరా తీసింది తెలుగు 360.కామ్.
”సెట్లో అగ్ని ప్రమాదం జరిగిన మాట నిజమే. అయితే… అప్పటికే అక్కడ తీయాల్సిన సీన్లన్నీ తీసేశారు. సెట్‌ని మొత్తం వెకేట్ చేసేశాం. ఇప్పుడు షూటింగ్ ఆర్.ఎఫ్.సీలో జరుగుతోంది. కాబట్టి.. సెట్‌కీ మాకూ ఎలాంటి సంబంధం లేదు” అంటూ చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ఇది వరకు సర్దార్ గబ్బర్ సింగ్ కోసం హైదరాబాద్ లో వేసిన ఓ భారీ సెట్ కూడా ఇలానే షూటింగ్ మొత్తం అయిపోయాక.. అగ్ని ప్రమాదానికి గురైంది.