కేరళ కొల్లాం పుట్టింగల్ ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించి 75 మంది కన్నుమూశారు. భారతదేశంలో జరిగిన అతిపెద్ద అగ్ని ప్రమాదాలలో ఇది ఒకటి. దేవుని సేవలో పాల్గొనడానికి వచ్చిన భక్తుల్లో ఏకంగా 75 మంది అసువులు బాయడం అంటే దేశమంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. మరణించిన వారి సంఖ్య ఇంకా భారీ గా పెరగవచ్చునని కూడా భయపడుతున్నారు. కొల్లాం పుట్టింగల్ ఉత్సవాలలో భాగంగా బాణసంచా పేల్చినప్పుడు జరిగిన ప్రమాదం భారీ అగ్ని ప్రమాదంగా మారిపోయింది.
దాదాపు 200 మందికిపైగా ఈ భారీ అగ్నిప్రమాదంలో గాయపడినట్లుగా సమాచారం. పోలీసులు, ఫైర్ సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం స్థానికులు అక్కడకు చేరుకుని భారీ ఎత్తున సహాయక కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారు. గాయపడిన వారికి ఆస్పత్రులకు తరలిస్తున్నవారు. వారికి చికిత్సలు అందుతున్నాయి. ఆలయ ప్రాంగణం మొత్తం హాహాకారాలు, ఏడుపులు, పెడబొబ్బలతో దారుణంగా మారిపోయింది.
ఈ ప్రమాదానికి సంబంధించి.. ప్రధాని మోడీ, కేరళ ముఖ్యమంత్రి దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించి కారణాలను వెలికి తీయడానికి ముఖ్యమంత్రి ఆదేశించారు.