అపార్టుమెంట్లు అయితే అగ్ని ప్రమాదాలు జరగవని అంతా కాంక్రీట్ కాబట్టి సమస్యే ఉండదని అనుకుంటారు. కానీ ఇటీవలి కాలంలో అపార్టుమెంట్లలో అగ్నిప్రమాదాలు పెరిగిపోయాయి. కొద్ది రోజుల క్రితం నల్లగండ్లలోని అపర్ణ అపార్టుమెంట్స్ లో తగలబడి అపార్టుమెంట్ ను చూసి అందరూ భయపడ్డారు. తర్వాత పలు చోట్ల ఇలాంటివి జరిగాయి. రెండు రోజుల కిందట ఖాజాగూడలోని ఓ అపార్టుమెంట్లో కూడా అగ్నిప్రమాదం జరిగింది. కోకాపేటలో నిర్మాణంలోఉన్న ఓ హైరైజ్ అపార్టుమెంట్ లో జరిగిన అగ్నిప్రమాదం రియల్ ఎస్టేట్ సర్కిల్స్ లో కొత్త ఆందోళనలకు కారణం అవుతున్నాయి.
నిజానికి కాంక్రీట్ జంగిల్స్ లో అగ్నిప్రమాదాల బెడద ఉండకూడదు. కానీ ఇప్పుడు ఇంటీరియర్ లేని అపార్టుమెంట్లు ఉండటం లేదు. ఇల్లు ఇంతా ఇంటీరియర్ ఉంటోంది. సీలింగ్ దగ్గర నుంచి ఇంటి గోడల వరకూ అంతా మండే గుణం ఉన్న వస్తువులతోనే డేకరేట్ చేస్తున్నారు. ఫలితంగా షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు మంటలు శరవేగంగావిస్తరిస్తున్నాయి. అంతా బూడితగా మారుతోంది. పై అంతస్తులోనే.. మధ్య అంతస్తులోనే .. కింద అంతస్తులోనే ఇంత భారీ స్థాయిలో మంటలు చూస్తే ఎవరైనా తమ ఫ్లాట్ పరిస్థితేమిటన్న ఆందోళనకు రాకుండా ఉండలేరు.
ఎందుకంటే…అపార్టుమెంట్లు పేకమేడల్లాంటివి. మధ్యలో ఒక్క ఫ్లాట్ ఇలాంటి అగ్నిప్రమాదాల వల్ల బలహీనపడినా.. మొత్తం అపార్టుమెంట్ బలహీనపడుతుంది . దాని వల్ల భవిష్యత్ లో అయినా సమస్యలు వస్తాయి. ఇలాంటి పరిస్థితులు కొనుగోలుదారుల్ని భయపెడతాయి. చాలా అపార్టుమెంట్లలో అగ్నిప్రమాదాలు నివారించడానికి అవసరమన పకడ్బందీగా ఏర్పాట్లు ఉంటున్నాయి. కొత్తగా కడుతున్న లగ్జరీ కాంప్లెక్స్‌లలో ప్రత్యేక జాగ్రత్తలతో ఏర్పాటు చేస్తున్నారు. కానీ జరుగుతున్న ప్రమాదాలతో .. కొనుగోలుదారులలో ఎక్కువ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.