ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా.. ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకుడు. ఈ రోజే అట్టహాసంగా ముంబైలో ప్రారంభమైంది. ప్రభాస్ సినిమా మొదలైందహో.. అని ఎగిరి గంతేసిన అభిమానులకు ఓ షాక్ తగిలింది. ముంబైలోని ఆదిపురుష్ సెట్లో కాసేపటి క్రితమే మంటలు చెలరేగాయి. సెట్ లో ఉన్న బ్లూ మాట్ లు కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తూ.. ఎవ్వరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ఇది ఇండోర్ సెట్. ఖరీదైన వస్తువులేం లేవు. అందుకే.. ఆస్తి నష్టం కూడా సంభవించలేదు. కాకపోతే… తొలి రోజే.. ఇలాంటి అపశృతి చోటు చేసుకోవడం… చిత్రబృందాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. పైగా.. ఇది రామాయణ నేపథ్యంలో సాగే కథ. దాంతో… ఏం జరిగినా… జనం ఆధ్యాత్మిక దృష్టితో చూడడం మొదలెడతారు. ఇక నుంచైనా చిత్రబృందం జాగ్రత్తగా ఉంటే మంచిదేమో..??