ఆంధ్రప్రదేశ్ లో గత సర్కార్ ప్రజాధనాన్ని అడ్డగోలుగా మేసేసిన వ్యవహారంలో సజ్జల భార్గవపై మొదటి కేసు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వైసీపీ సోషల్ మీడియా వేల కోట్లు ప్రజాధనాన్ని స్వాహా చేసిందని బయటపడింది. దీనిపై విచారమ చేయించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ఔట్ సోర్సింగ్ పేరిట వేల కోట్ల చెల్లింపులు చేశారు. వీరంతా వైసీపీ కోసం పని చేశారు. పైకి మాత్రమే కార్పొరేషన్.. చేసిందంతా దోపిడీనేనని.. ప్రజల సొమ్ముతో సోషల్ మీడియాలో వైసీపీ ప్రచారం చేసిందని తేలింది
సమాచార శాఖలో బయటకొస్తున్న స్కామ్ మూలాలు సంచలనం సృష్టిస్తున్నాయి. విచారణ జరపాలంటూ మంత్రులకు టీడీపీ నేతల ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా త్వరలో కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. జడ్జిలపై తప్పుడు వ్యాఖ్యలు చేసి అరెస్టయిన వారికి కూడా లక్షల్లో జీతాలు ఇచ్చారు. బెయిల్ పై వచ్చిన తర్వాత కూడా వారికి పెద్ద ఎత్తున జీతాలు చెల్లించారు. పాన్ దుకాణాలు నడుపుకునేవారికి చివరికి.. ఇటీవల టీడీపీ నేతలు దాడి చేశారని ఆరోపణలు చేసన పాలేటి రాజ్ కుమార్ ఆయన భార్యకు కూడా జీతాలు చెల్లించినట్లుగా అనుమానిస్తున్నారు.
ఇలా జీతాలు తీసుకున్న వారంతా చేసేది బూతుల దాడి. అంతా సజ్జల భార్గవ నేతృత్వంలో జరుగుతోంది. చివరికి పాపం పండే పరిస్థితి వచ్చింది. కేసులు నమోదవుతాయని తెలియడంతో సజ్జల భార్గవ ఆజ్ఞాతంలో ఉన్నాడని చెబుతున్నారు. అయితే ఎక్కడికి వెళ్లినా తండ్రితో పాటు కుమారుడ్నీ వదలరని ముందుంది ముసళ్ల పండగని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.