కింగ్ అక్కినేని నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టేశారు. సంక్రాంతికి ఫిక్స్ అయిన నాలుగు సినిమాల్లో మొదట్నుంచీ ఒక ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించిన ‘సోగ్గాడే..’ నిన్న పెద్ద ఎత్తున విడుదలై మంచి హిట్ కొట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలైన ఈ చట్రం అన్నిచోట్లా ఈ సినిమాకు మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి షో నుంచే ఈ సినిమాకు అన్నిచోట్లా సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ‘మనం’ తర్వాత నాగ్ చేసిన సినిమా ఇదే కావడం, రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌తో విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా మొదటి రోజు హౌస్‌ఫుల్స్‌తో కనిపించింది. నైజాం ఏరియాలో తక్కువ థియేటర్స్ లలో అయిన మొదటిరోజు ఈ సినిమా 1 కోటి 6 లక్షల రూపాయల షేర్ వసూలు చేసి స్ట్రాంగ్ ఓపెనింగ్స్ తెచ్చింది. మూడు ఇతర సినిమాలతో కలిసి థియేటర్లను పంచుకున్నా కూడా ఈ స్థాయి కలెక్షన్స్ నాగ్ సినిమాకు రావడం విశేషం. ఈ వీకెండ్‌కి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా. కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమాను నాగార్జున స్వయంగా నిర్మించారు. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటించారు.