శ్రియ సినిమా ప్రయాణానికి శుభం కార్డు పడినట్లే అనుకున్న సమయంలో ‘మనం’ సినిమా వచ్చింది. ఆ ఏడాది ఆమెకు మరో అవకాశం రాలేదు. నెక్స్ట్ ఇయర్ ‘గోపాల గోపాల’ వచ్చింది. ఆ నెక్స్ట్ ఇయర్ ‘ఊపిరి’లో గెస్ట్ క్యారెక్టర్ చేసింది. హీరోయిన్గా చేతిలో ఒక్క సినిమా లేదు అనుకుంటున్న సమయంలో నందమూరి బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో అవకాశం వచ్చింది. అదే శ్రియ దశను మళ్లీ మార్చింది. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తర్వాత బాలకృష్ణ ‘పైసా వసూల్’లో ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కెమెరామేన్ జ్ఞానశేఖర్ వంతు వచ్చింది. శ్రియ హీరోయిన్గా ఆయన ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ దర్శకుడు క్రిష్ కూడా ఈ సినిమా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ సినిమాకి సృజన అనే మహిళ దర్శకురాలు. త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది.