మంకీపాక్స్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి అనుమానాస్పద కేసు పాజిటివ్ గా తేలింది. దీంతో కేంద్రం అలర్ట్ జారీ చేసింది. మంకీపాక్స్ లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేక క్వారంటైన్లకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించింది. అయితే పానిక్ అవ్వాల్సిన పని లేదని..మంకీపాక్స్ మరో కరోనా కాదని నిపుణులు చెబుతున్నారు. మంకీపాక్స్ కరోనా వ్యాపించినంత సులువుగా వ్యాపించే అవకాశాలు లేవు. ఇది కోతులు, కొండ ముచ్చులు వంటి వాటితో శృంగారం జరపడం వల్ల వచ్చే వైరస్. దీన్ని మొదట ఆప్రికాలో గుర్తించారు.
ఇది సోకిన మనిషి నుంచి మరో మనిషికి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నా.. గాలి ద్వారా లేదా.. మరో విధంగా వ్యాప్తి చెందదని.. నేరుగా సంబంధం ఉంటేనే వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో ఇది వ్యాపించిది. అయితే ఏ దేశంలోనూ కరోనా స్థాయిలో ఎవరూ బయపడటం లేదు. ఓ ప్రభుత్వమూ ఆ స్థాయిలో జాగ్రత్తలు చెబుతూ పానిక్ సృష్టించడం లేదు.
మంకీపాక్స్ కు సంబంధించి ఇప్పటికే ఓ వ్యాక్సిన్ మార్కెట్లో కి వచ్చింది. వైరస్ ను గుర్తించడానికి ఓ ఆర్టీపీసీఆర్ కిట్ ను.. వైజాగ్ మెడ్ టెక్ జోన్ డెలవప్ చేసింది. దానికి అన్ని అత్యవసర అనుమతులు వచ్చాయి. కరోనా వైరస్ వచ్చి పోయిన తర్వాత చాలా మంది.. వైరస్ లు అంటే భయపడటం మానేశారు. అయితే మంకీపాక్స్ విషయంలో మెడికల్ మాఫియా భయం సృష్టించే ప్రయత్నాలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.