హైదరాబాద్: హర్యానాలో ఇటీవల జాట్లకు రిజర్వేషన్ల కోసం చేస్తున్న ఆందోళన సందర్భంగా కొందరు ఆందోళన కారులు మహిళలపై అత్యాచారాలు చేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అత్యాచారాలు జరిగిన ఆనవాళ్ళను, మహిళల లోదుస్తులను తాము చూశామని లారీ డ్రైవర్లు చూశామని మీడియాకు చెప్పారు. కానీ, ఇప్పటివరకు దానికి సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే నిన్న మొట్టమొదటిసారిగా ఒక బాధితురాలు ముందుకొచ్చి ఫిర్యాదు చేశారు. ముర్తాళ్కు చెందిన ఒక మహిళ తన బావతో సహా ఏడుగురు వ్యక్తులపై ఫిర్యాదు చేయటంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈనెల 22వ తేదీ రాత్రి ఒక వ్యాన్లో ఢిల్లీనుంచి హరిద్వార్ వెళుతుండగా ఈ ఘటన జరిగిందని, అత్యాచారం చేసిన వారంతా తనకు తెలుసని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదు వెనక కుటుంబ విభేదాలు ఉండే అవకాశంకూడా లేకపోలేదని పోలీసులు చెబుతున్నారు. జాట్ల ఆందోళనకు సంబంధించి, ఆందోళనకారులు తమ వాహనాలను నాశనం చేశారన్నవే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు.