ఏపీ ఎన్నికల ఫలితాల లెక్కింపుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఫలితాలు ఎప్పుడెప్పుడా అన్న ఉత్కంఠ పెరిగిపోతుంది. అయితే, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్లను బట్టి తుది ఫలితాలకు సమయం పట్టే అవకాశం ఉంది.
తొలి ఫలితం నరసాపురం నియోజకవర్గంతో పాటు కొవూరు, రాజమండ్రివి ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కేవలం 13రౌండ్లలో లెక్కింపు పూర్తికాబోతుంది. భీమిలి, పాణ్యం నియోజకవర్గాల్లో 26రౌండ్లలో లెక్కింపు ఉంటుందని… ఇక్కడ ఫలితాలు తేలే వరకు సాయంత్రం అయ్యే అవకాశం ఉందని సీఈవో మీనా ప్రకటించారు. ఉదయం ఎన్నికల కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో ప్రారంభం అవుతుందని..పోస్టల్ బ్యాలెట్ లేని చోట్ల యధావిధిగా ఎనిమిది గంటల నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. 8 : 30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని..ఈసారి పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువ నమోదు కావడంతో పోస్టల్ బ్యాలెట్ల కోసం ఎక్కువ సమయం పట్టొచ్చన్నారు.
ఇక, అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్ లో గరిష్టంగా దాదాపు 27 రౌండ్లు ఉంటాయని… తుది ఫలితం వచ్చేందుకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయం పడుతుందని వెల్లడించారు. అటు 104 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు గంటల్లో తుది ఫలితాలు వస్తాయని, 61 స్థానాల్లో ఫలితం తేలేందుకు 9, 10గంటల సమయం పడుతుందని చెప్పారు.
హోరాహోరీ పోరు ఉంటే… విజేత ఎవరో మద్యాహ్నం తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.