ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న మహేశ్ బాబు, త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ నుంచి ఎట్టకేలకు ఫస్ట్ సింగిల్ వచ్చింది. త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి తొలిపాట ‘దమ్ మసాలా’ ని వదిలారు. తమన్ మాస్ క్యాచి బీట్స్ తో కంపోజ్ చేసిన ఈ పాటు రామజోగయ్యశాస్త్రి అందించిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంజిత్ హెగ్డే, తమన్ ఎనర్జిటిక్ గా ఈ పాటని ఆలపించారు.
పాటలో ముందుగా సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఎస్టాబ్లెస్ చేస్తూ.. సర్రుమండుతాది బాబు గొడ్డు కారం.. గిర్ర తిరుగుతాది ఈడి తోటి బేరం.. అంటూ ఓ ర్యాప్ శాకీ వస్తుంది. తర్వాత పల్లవిలో వినిపించిన సాహిత్యం మరింతగా ఆకట్టుకునేలా రాశారు.
ఎదురొచ్చే గాలి
ఎగరేస్తున్న చొక్కా పై గుండి
ఎగబడిముందరకే వెళ్లిపోతాది నెనెక్కిన బండి
ఏ లెక్కలు ఎవడికి చెప్పాలి
ఏ హక్కు ఎవడికి రాయాలి
ఎవడెవడో వేసిన బరువు
ఎందుకు ఎందుకు నే మొయ్యాలి..
నేనో నిశ్శబ్దం అనునిత్యం నాతో నాకే యుద్ధం
స్వార్ధం పరమార్ధం కలగలసిన నేనో ప్రేమ పదార్ధం…
నా మనసే నా కిటికీ నచ్చకపొతే మూసేస్తా
ఆ రేపటి గాయాన్ని ఇపుడే ఆపేస్తా
నా తలరాతే రంగుల రంగోలి
దిగులైన చేస్తా దీవాళి
నా నవ్వుల కోటను నేనే ఎందుకుఎందుకు పడగొట్టాలి.. ఈ లైన్స్ లో రామజోగయ్యశాస్త్రి మార్క్ తో పాటు త్రివిక్రమ్ స్టయిల్ రిఫరెన్స్ లు కనిపించాయి. త్రివిక్రమ్ హీరో ఇంట్రో పాటల్లో మాస్ ఉంటూనే మీనింగ్ ఫుల్ గా వుంటాయి. దమ్ మసాలా పాటలో కూడా మీనింగ్ ఫుల్ మాస్ కనిపించింది.
విజువల్ విషయానికి వస్తే.. ఒక ఫైట్ సీక్వెన్స్ లో పుటేజ్, వర్కింగ్ స్టిల్స్ కలిసి ఈ లిరికల్ వీడియోలో ఎడిట్ చేశారు. మహేష్ బాబు మాస్ స్వాగ్ బావుంది. ఇందులో మ్యానరిజం ఏమిటో గానీ చాలా షాట్స్ లో సిగరెట్ తాగుతూనే కనిపిస్తున్నారు మహేష్. మొత్తానికి మాస్ కి తక్షణమే కనెక్ట్ అయ్యేలా వుందీ పాట. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.