కంటెంట్ ఏదైనా సరే .. అన్ని దినుసులు కలిపి.. ఇది ఫుల్ మీల్స్ లాంటి సినిమా అని ప్రచారం చేసుకునే సంప్రదాయంలో అనాదిగా వస్తోంది. ఇప్పుడు రవితేజ టైగర్ నాగేశ్వరరావు కూడా ఇదే బాటలో వెళుతోంది. స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తీసిన సినిమా ఇది. టీజర్ లో టైగర్ నాగేశ్వరరావు ని నటోరియస్ క్రిమినల్ గా చూపించారు. టీజర్ చూశాకా.. సినిమా అంత సీరియస్ హై ఇంటన్సిటీ తో వుటుందేమో అనే ఫీలింగ్ కలిగింది.
ఐతే ఇంతలోనే ఇది రవితేజ సినిమా అని గుర్తు చేస్తూ.. ఇడియట్ సినిమా టైపు లో ఎక్ దమ్ అనే పాటని రిలీజ్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు అంటే రాబిన్ వుడ్ టైపు ఇమేజ్ ఊహించుకుంటాం. ఐతే ఆయనలో ఇడియట్ యాంగిల్ కూడా వుందని ఈ పాట చూస్తే అర్ధమౌతుంది. సగటు కమర్షియల్ సినిమాలో హీరోలా కాలేజీలోకి చొరబడి హీరోయిన్ ని ఈవ్ టీజింగ్ చేస్తూ కనిపించారు రవితేజ. పాట ఎలా వుందనే మాట పక్కన పెడితే.. టైగర్ నాగేశ్వరరావు జీవితంలో ఇలాంటి సరదాలు సరసాలు కూడా ఉన్నాయా అనిపించింది పాట చూస్తే. మొత్తానికి ఈ బయోపిక్ కి కావాల్సినంత మసాలా జోడించారని ప్రచార చిత్రాలు చూస్తుంటే అర్ధమౌతుంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.