కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో ప్రత్యేక హోదా కోసం నిన్న నిర్వహించిన బహిరంగ సభలో ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసిన తిరుపతికి చెందిన మునికామకోటి చెన్నై కే.ఎం.సి. ఆసుపత్రిలో ఆదివారం మధ్యాహ్నం మరణించాడు. సుమారు 50 శాతం పైగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన అతని ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు విశ్వా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. అతని మృతికి అన్ని రాజకీయ పార్టీల నేతలు సంతాపం తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ట్వీటర్ ద్వారా అతని కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ప్రత్యేక హోదా అంశం గురించి ప్రస్తుత పరిస్థితుల్లో మాట్లాడకుండా తనను తాని చాల నిగ్రహించుకొంటున్నట్లు తెలిపారు.